Apple Face Pack : యాపిల్ చేసే మ్యాజిక్.. ఇలా వాడితే మొటిమలు మచ్చలు మాయం అవ్వాల్సిందే!

ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పండ్ల‌లో యాపిల్ ఒకటి.రోజుకు ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటుంటారు.

ఎందుకంటే యాపిల్ పండు( Apple )లో అనేక ముఖ్యమైన పోషకాలు మరియు విటమిన్లు ఉంటాయి.ఇవి వివిధ వ్యాధుల నుండి మనలను కాపాడతాయి.

అలాగే యాపిల్ పండులో స్కిన్ కేర్ బెనిఫిట్స్ కూడా దాగి ఉన్నాయి.ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే కాకుండా స్కిన్ విషయంలోనూ యాపిల్ మ్యాజిక్ చేస్తుంది.

ముఖ్యంగా మొటిమలు మచ్చలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి యాపిల్ ఒక వరం అని చెప్పుకోవచ్చు.మ‌రి చర్మానికి యాపిల్ పండును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక యాపిల్ పండును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి( Multani Mitti ), వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ తేనె మరియు సరిపడా యాపిల్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకోవాలి.20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని ఆపై శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ యాపిల్ ఫేస్ ప్యాక్ ( Apple Face Pack )వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

యాపిల్ పండులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ మొటిమలు, మొండి మచ్చలను వదిలించడానికి తోడ్పడతాయి.యాపిల్ లో ఉండే రాగి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

కొల్లాజెన్ మన చర్మానికి కీలకమైన ప్రోటీన్.ఇది చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తుంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

మరియు వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా రక్షిస్తుంది.తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి.

Advertisement

స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండేలా ప్రోత్సహిస్తాయి.మరియు ముల్తానీ మట్టి, కార్న్ ఫ్లోర్ చర్మంపై చనిపోయిన కణాలను తొలగిస్తాయి.

అదే స‌మ‌యంలో స్కిన్ టోన్ ను పెంచుతాయి.

తాజా వార్తలు