పెదవులు చుట్టూ చర్మం నల్లగా కనిపిస్తుందా.. అయితే ఈ టిప్స్ గురించి తెలుసుకోండి!

సాధారణంగా కొందరికి పెదవుల చుట్టూ చర్మం నల్లగా కనిపిస్తుంటుంది.

హైపర్ పిగ్మెంటేషన్, డీహైడ్రేషన్, స్మోకింగ్, పలు రకాల విటమిన్ల లోపం తదితర కారణాల వల్ల పెదవులు చుట్టూ చర్మం నల్లగా ( Dark skin )మారిపోయి అసహ్యంగా కనిపిస్తుంటుంది.

ఆ నలుపును చాలామంది మేకప్ తో కవర్ చేస్తూ ఉంటారు.కానీ సహజంగా ఆ నలుపును పోగొట్టుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ చాలా బాగా సహాయ పడతాయి.మరి ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Try These Simple Tips To Get Rid Of Darkness Around Mouth Darkness Around Mouth

టిప్-1: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ), వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet almond oil ), హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic turmeric ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని లిప్స్ చుట్టూ అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Advertisement
Try These Simple Tips To Get Rid Of Darkness Around Mouth! Darkness Around Mouth

రెగ్యులర్ గా ఈ చిట్కాను పాటిస్తే నలుపు పోయి పెదాల చుట్టూ ఉన్న చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

Try These Simple Tips To Get Rid Of Darkness Around Mouth Darkness Around Mouth

టిప్-2: ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani soil ), వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్లు పొటాటో జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ టమాటో జ్యూస్ ( Tomato juice )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదవుల చుట్టూనే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో కడిగేయాలి.

ఈ సింపుల్ రెమెడీని వారానికి రెండు లేదా మూడు సార్లు పాటిస్తే స్కిన్ టోన్ ఈవెన్ గా మారుతుంది.పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.

చర్మంపై ముదురు రంగు మచ్చలు ఏమైనా ఉంటే తగు ముఖం పడతాయి.పెదవులు చుట్టూ చర్మం తెల్లగా మారుతుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఇక ఈ టిప్స్ ని ఫాలో అవ్వడంతో పాటు శరీరానికి సరిపడా వాటర్ ను అందించండి.స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకోండి.

Advertisement

విటమిన్ బి12, విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి.

తాజా వార్తలు