హుజూర్‌ నగర్‌ ఫలితంపై కవిత స్పందన ఏంటో తెలుసా?

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది.టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఉత్తమ్‌ పద్మావతి పై ఏకంగా 43 వేలకు పైచిలుకు ఓట్లతో సైదిరెడ్డి గెలవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సంబురాల్లో మునిగి పోయారు.ఈ స్థానం నుండి మొదట కేసీఆర్‌ కూతురు కవితను పోటీ చేయించాలని భావించారు.

ఆమె ఎంపీగా ఓడిపోయిన వెంటనే ఈ వార్తలు చాలా ఎక్కువగా వచ్చాయి.కాని హుజూర్‌ నగర్‌లో కూడా ఓడిపోతే చాలా డ్యామేజ్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆమెను పోటీ చేయించేందుకు ఆ పార్టీ నాయకులు ఆసక్తి చూపించలేదు.

గత ఎన్నికల్లో ఉత్తమ్‌ను ఢీ కొట్టిన శానంపూడి సైదిరెడ్డినే మళ్లీ నిలబెట్టడం జరిగింది.సైదిరెడ్డి విజయంపై కవిత స్పందిస్తూ.

Advertisement

కెసిఆర్ గారి పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, తెరాస పార్టీ కి అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన తెరాస కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు అంటూ స్పందించారు.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement