ఇక సమరానికి సిద్దమైన టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు

హుజూరాబాద్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ ఇక పూర్తి స్థాయిలో సన్నద్దమవుతోంది.

రోజురోజుకు పోలింగ్ కు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఇక పూర్తి స్థాయి ఉధృతమైన ప్రచారాన్ని నిర్వహించడానికి సన్నద్దమవుతోంది.

మంత్రులు గంగుల కమలాకర్, హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుల తో పాటు మరికొంత మంది ఈ స్టార్  క్యాంపెయినర్  ల జాబితాలో ఉన్నారు.అయితే ప్రస్తుతం హుజూరాబాద్ లో గెలుపుపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్ ఇక గెలుపు వ్యూహాలను సిద్దం చేసుకునే పనిలో పూర్తి స్థాయిలో నిమాగ్నమయిందని చెప్పవచ్చు.

TRS Star Campaigners Ready For Battl Kcr, Huzurabad Byelections , Trs Party , Ha

అయితే ప్రభుత్వ విజయాలను ముఖ్యంగా ప్రజల ముందు ఉంచుతూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పైనే ఫోకస్ పెడుతూ టీఆర్ఎస్ ప్రచారం సాగనుంది.అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి ఉంది.

బీజేపీ కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తోంది.అయితే ఇక ఎవరికి వారు మండలాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ కు ఓటు వేయాలవల్సిందిగా ఓటర్లను కోరనున్నారు.

Advertisement

అంతేకాక ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు కూడా దళిత బంధు అందిన నేపథ్యంలో ఇతర కులాలకు కూడా వర్తింపంజేస్తామని చెబుతూ తమకు ఉన్న సానుకూల అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకొని తమ విజయం సాధిచే దిశగా ముందుకు సాగనున్నారు.అయితే ఇక ప్రచారం చివరి తేదీల్లో కెసీఆర్ బహిరంగ సభ నిర్వహించి హుజూరాబాద్ పై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది.

మరి టీఆర్ఎస్ ఎలా తమ ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తుందనేది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు