టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీకి లీడర్ లేడు.

ఒక ఐడియాలజీ లేదన్నారు.

రాముడు పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు.

ఐటీ, ఈడీ దాడులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.కానీ బీజేపీ బెదిరింపులకు భయపడేవాళ్లు తెలంగాణలో ఎవరూ లేరని చెప్పారు.

నెల రోజులుగా మంత్రులపై దాడులు జరుగుతున్నాయని కవిత వెల్లడించారు.తమ మంత్రులు ఈడీ, ఐటీ పిలిస్తే విచారణకు వెళ్తున్నారన్న ఆమె.బీజేపీ నేత బీఎస్ సంతోష్ విచారణకు రమ్మంటే భయపడుతున్నారని తెలిపారు.తప్పు చేయకపోతే బీఎల్ సంతోష్ కు భయమెందుకు అని కవిత ప్రశ్నించారు.

Advertisement

దొరికిన దొంగలపై విచారణ చేయొద్దా అని అడిగారు.వారు విచారణకు ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించాలని సూచించారు.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!
Advertisement

తాజా వార్తలు