టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ప్రజలను బ్లాక్‌మేయిల్ చేస్తున్నాడా.. ??

కొన్ని కొన్ని సమయాల్లో తెలంగాణ ప్రజలు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారా అనే అనుమానాలు కొంతమంది విద్యాధికుల్లో రేకెత్తుతున్నాయట.

ఆంధ్రపాలకుల నుండి విముక్తి అంటూ నినాదాలందించి, దొరల పాలనలో ఈ బ్రతుకులను బండకేసి బాదుతున్నారనే బాధ లోపల కలుగుతున్న బయటకు చెప్పుకోలేకపోతున్నారని అంటున్నారట కొందరు.

ఈ స్వతంత్ర భారత దేశంలో ప్రజలకు నచ్చినట్లుగా జీవించడం, నచ్చిన పార్టీలకు ఓటేసి గెలిపించే హక్కులు కూడా నేడు తెలంగాణాలో కనిపిస్తలేవట.ఇందుకు నిదర్శనాలే, తెలంగాణ పాలకులు, పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరునే చెప్పుకుంటున్నారట.

Station Ghanpur, TRS MLA, Rajaiah, Sensational Comments, Blackmailing, Telangana

ఇకపోతే ఇప్పటికే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారట.ఇకపై ప్రభుత్వ పథకాలు పొందాలంటే టీఆర్ఎస్ సభ్యత్వం తప్పక ఉండాలని, ఇవి ఉంటేనే ఆ పధకాలు వర్తిస్తాయని వెల్లడించారట.

రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇండ్లకూ కూడా ఇదే విధానం వర్తిస్తుందని వ్యాఖ్యానించారట.ఇప్పటి నుంచి మూడేండ్ల వరకు టీఆర్ఎస్ మెంబర్ షిప్ ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటూ రాజయ్య మాట్లాడటం కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటే, మరి కొందరికి ఆగ్రహాన్ని తెప్పిస్తుందట.

Advertisement

అంటే ప్రజలను బ్లాక్‌మేయిల్ చేస్తున్నట్లే కదా? అనే ప్రశ్నలు ఈ మాటలు విన్న తెలంగాణ ప్రజల్లో ఉద్బవిస్తున్నాయట.

ఎండల వల్ల మీ ముఖం మెడ నల్లగా మారాయా.. ఈ రెమెడీతో 20 నిమిషాల్లో చర్మాన్ని రిపేర్ చేసేయండి!
Advertisement

తాజా వార్తలు