మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఎప్పుడు ఏ వివాదంలో దొరుకుతారా ఎప్పుడు రోడ్డు మీదకి లాగుదామా అని ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలకి.

ఇదిగో మా తల బయటకి లాగేయండి అన్నట్టుగా వరుస వివాదాలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కేసీఆర్ కి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాడు.

మొన్న ఒక మీటింగ్ లో రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన ముత్తిరెడ్డి.కేసీఆర్ వల్ల ఒక మెట్టు దిగి వచ్చారు.

తన మాటలతో ఎవరైనా బాధ పడితే క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు.ఇక అంతటితో ఈ గొడవ సర్దు మణిగింది అనుకున్నారు కానీ.

రిజర్వేషన్లు తొలగించాలని నేను అనలేదు అంటూ వివరణ ఇచ్చిన ముత్తిరెడ్డి.మీడియా తన మాటలు వక్రీకరించింది అని అన్నారు.

Advertisement

తాను 21 నిమిషాలపాటు మాట్లాడిన దాంట్లో రిజర్వేషన్ల అంశాన్ని మాట్లాడలేదని ప్రకటించారు.ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్స్ తొలగించాలని తాను అనలేదని పేర్కొన్నారు.

తాను ఏ కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు.చదువుకున్న ఎంతో మంది విద్యార్ధులకి అన్యాయం కలగకుండా చూడాలని మాత్రమే అన్నాను అని తెలిపారు.

అసలు ఎస్సీ, ఎస్టీ, బిసి లపై నేను ఎందుకు మాట్లాడుతాను వారి కోసం నేను ఎంతో చేశాను.దళితులకు మూడేకరాల భూమి తన నియోజకవర్గంలో పంచకుండా అధికారులు అడ్డపడితే కడియం శ్రీహరికీ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

దళితుల పట్ల తమకు చిత్తశుద్ధి వుందన్నారు.అయినా తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే.

Royal Panda : Player Safety And Responsible Gambling — An ...
Royal Panda : Player Safety And Responsible Gambling — An ...

క్షమాపణ చెబుతున్నా అని అన్నారు.ఇంతవరకు బాగానే వివరణ ఇచ్చిన ముత్తిరెడ్డి.

Advertisement

రిజర్వేషన్ల ద్వారా చదువుకున్న ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ గురించి చెప్తూ మరో సంచలన వివాదం రేపారు.ఐసిఎస్ ప్రవీణ్ కుమార్ తన పిల్లలను రిజర్వేషన్ కోటాలో కాకుండా ఓపెన్ కోటాలో చదివిస్తున్నారని చెప్పారు.

ఆయనకు హ్యాట్సాప్ చెబుతున్నానని వివరించారు.రిజర్వేషన్లు అనుభవించి పైకొచ్చిన వారంతా ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ లా ప్రయత్నం చేయాలంటూ సలహా ఇచ్చారు.

ఇదంతా ప్రతిభ ఉన్న వాళ్ళు నష్ట పోకూడదు అని నేను చెప్తునాను అని ఎవరు ఈ విశయంలో తప్పుగా భావించవద్దు అన్నారు.మరి ఈ విషయం పై ఎవరు ఎన్ని కారాలు మిరియాలు నూరుతారో వెయిట్ అండ్ సీ .