సర్వేలన్నీ మనకు అనుకూలమే సిద్ధంగా ఉండండి

అన్ని సర్వేల్లోనూ టిఆర్ఎస్ పార్టీ కి అనుకూలమైన ఫలితాలు వచ్చాయని, ఎవరు ఎటువంటి భయం లేకుండా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా రెపరెప లాడుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన శనివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 120 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పార్టీ నాలుగు సార్లు చేసిన సర్వే వివరాలను ఆయన వెల్లడించారు.

మున్సిపాలిటీల వారీగా ఓటర్ల జాబితాతో పాటు, నూతన మున్సిపల్ యాక్ట్ కాఫీ లను కూడా అక్కడకు హాజరైన నాయకులకు అందించారు.ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలకు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ బాధ్యతను అప్పగించారు.

ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలకు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపాలని సూచించారు.మన పార్టీకి బిజెపి పోటీ వస్తుంది అనే ఊహాగానాలను విడిచిపెట్టి అందరినీ కలుపుకు వెళ్లాలని ఆయన ఆదేశించారు.

Advertisement

పార్టీ నిర్ణయించిన అభ్యర్థి విజయానికి అందరూ కృషిచేయాలని, అనవసర గ్రూపు తగాదాలు వెళ్లి ఎన్నికల్లో ఓటమికి కారణం వద్దంటూ హెచ్చరించారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు