సర్వే ఎఫెక్ట్ : లగడపాటిపై ఈసీకి ఫిర్యాదు

మొత్తానికి ఆంధ్రా ఆక్టోపస్ సర్వే ఫలితాలు తెలంగాణాలో కాక రేపుతున్నాయి.ముఖ్యంగా ఈ సర్వే ఫలితాలు టీఆర్ఎస్ కి కోపం తెప్పిస్తున్నాయి.

అందుకే లగడపాటి చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఆ పార్టీ శనివారం రాత్రి ఈ విషయంపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది.

లగడపాటి సర్వేల పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ సర్వే ఫలితాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని.ఫిర్యాదుతో పాటు వీడియో ఫుటేజీని కూడా ఈసీకి టీఆర్ఎస్ అందజేసింది.

అయితే ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఎలా స్పందించబోతోంది అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

Advertisement
Advertisement