బాబు స్పీడ్ కి బ్రేకులు : 'ఉచిత బస్సు ' ఇప్పట్లో లేనట్టేనా ? 

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలు అన్నిటిపైనా దృష్టి సారించింది.ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి.

అయితే కొన్ని పథకాలు విషయంలో ఆర్థిక ఇబ్బందులు , చిన్న చిన్న లోటుపాట్లు , వాటి అమలుకు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి.ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం,  కొన్ని పథకాల అమలు విషయంలో తలెత్తే ఇబ్బందులు దృష్ట్యా, ఆయా పథకాల అమలు నిర్ణయాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం( Free Bus Journey ) విషయంలోనూ ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి .ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని టిడిపి అధినేత చంద్రబాబు( CM Chandrababu ) ప్రకటించారు.  కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని ఇప్పటి వరకు అమలు చేయలేదు.

అయితే దీనికి కారణాలు చాలానే ఉన్నాయట.

Advertisement

ఈ పథకం అమలులో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడం,  ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న కర్ణాటక తెలంగాణలో అధ్యయనం చేసి వచ్చినా,  ఏపీ అధికారులు అందులోని లోటుపాట్లను చంద్రబాబుకు వివరించడంతో ఈ పథకం అమలుకు మరికొంత సమయం తీసుకుంటే మంచిదనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారట .మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లో ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉందని అధికారుల అధ్యయనంలో తేలడంతో,  బాబు ఈ విషయంలో ముందుకు వెళ్లలేకపోతున్నారు.  దీనికి తోడు ఆటో డ్రైవర్ల( Auto Drivers ) నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని, అలాగే ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తెస్తే సరిపడ బస్సులు లేకపోవడంతో,  ఆర్టిసి ప్రయాణం అస్థ వ్యస్తంగా మారుతుందని , ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొత్త బస్సులను కొనే పరిస్థితి లేకపోవడం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారట.

ఇప్పటికే కర్ణాటక,  తెలంగాణలో మహిళలకు బస్సు ఉచితం కావడంతో,  రాష్ట్రమంతా వారు ప్రయాణిస్తున్నారు .పురుషులు సీట్లు దొరుకక ఇబ్బందులు ఎదుర్కోవడం , ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను ప్రతినెల ఆర్టీసీకి చెల్లిస్తున్నారు .అదనపు బస్సులను కొనుగోలు చేసినా ఫలితం లేకపోవడం,  పురుషుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం,  అలాగే కర్ణాటకలోనూ ఉచిత బస్సు ప్రయాణంపై అక్కడి ప్రభుత్వం పునరాలోచనలో పడింది.  అయితే ఈ పథకాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి సిద్ది రామయ్య చెప్పినప్పటికీ,  ఆర్థికంగా అక్కడ ప్రభుత్వానికి ఈ పథకం భారంగా మారడంతో సుదీర్ఘకాలం ఈ ఉచిత బస్సు ప్రయాణం కొనసాగించే అవకాశం కనిపించడం లేదు.

ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న బాబు ఇప్పుడు ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అప్పుడే ఈ పథకం అమలు జోలికి వెళ్ళకూడదనే ఆలోచనతో ఉన్నారట.

వామ్మో.. యాపిల్ టీతో ఇన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చా..?
Advertisement

తాజా వార్తలు