మహేష్ కి అవమానం

బ్రహ్మోత్సవం చిత్రాన్ని ప్రకటించినప్పుడు తెలుగుతో పాటు తమిళ భాషలో ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారు.

బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ కూడా తెలుగుతో పాటు తమిళంలో సమాంతరంగా విడుదల చేశారు.

ఇప్పడొక ట్విస్ట్‌ వచ్చిపడింది.బ్రహ్మోత్సవం తమిళంలో తెలుగుతోపాటుగా విడుదల అవడం అనుమానంగా మారింది.

Troubles For Brahmotsavam Tamil Version-Troubles For Brahmotsavam Tamil Version-

మహేష్ కి తమిళనాడులో మంచి క్రేజ్ ఉంది.పరభాష హీరల్లో, ఆమీర్ ఖాన్ తరువాత, మహేష్ కి మాత్రమే తమిళనాడులో భారి ఓపెనింగ్స్ వస్తాయని అక్కడి ట్రేడ్ అనాలిస్ట్ శ్రీధర్ పిల్లై అన్నారంటే మీరే అర్థం చేసుకోండి, అక్కడ మనోడు ఎంత ఫేమసో.

ఇంకా చెప్పాలంటే మహేష్ సినిమాలన్నీటికి చెన్నైలో బెనిఫిట్ షోలు పడతాయి.ఆ క్రేజ్ ని పట్టుకోనే బ్రహ్మోత్సవం తమిళ వెర్షన్ హక్కుల కోసం నోటికొచ్చిన రేటు చెప్పారట నిర్మాతలు.

Advertisement

చెబుతున్న రేట్లకి జడుసుకున్న బయ్యర్లు, సినిమా కొంటాం కాని, తెలుగులో హిట్ అయితే మాత్రమే అంత రేటు పెట్టడానికి అలోచిస్తామని చెప్పారట.ఆ రకంగా బ్రహ్మోత్సవం తమిళ వెర్షన్ ఆలస్యంగా విడుదల కావొచ్చు.

Advertisement

తాజా వార్తలు