ది వారియర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. దేవి శ్రీ ప్రసాద్ పై దారుణమైన ట్రోల్స్!

టాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ది వారియర్.

ఇందులో మొదటిసారిగా రామ్ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.

దర్శకుడు లింగస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు తమిళంలో రూపొందించారు.తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తెలిసిందే.

భారీ అంజనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.కాగా ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోని నటించగా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించాడు.

కాగా ఈ సినిమాలోని పాటలు పెట్టడం యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

Advertisement

ఉస్తాద్ రామ్ పోతినేని పేరు పడేప్పుడు వచ్చే బీజీఎంను సాహోలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చేప్పుడు వచ్చే మ్యూజిక్‌ను గుర్తుకు తెస్తోంది.ఈ రెండిని కంపేర్ చేస్తూ నెట్టింట దేవీ శ్రీ ప్రసాద్‌ పై ట్రోల్స్ చేస్తున్నారు.

వాట్ ఈజ్ దిజ్ మ్యాన్ అంటూ దేవి శ్రీ ప్రసాద్ ను ప్రశ్నిస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే డాక్టర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా సత్య పాత్ర పోషించిన రామ్ పోతినేని ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టేశాడు.విజిల్ మహాలక్ష్మీ క్యారెక్టర్‌లో కృతి శెట్టి ఎంతో క్యూట్‌గా, బబ్లీ లుక్‌లో అలరించింది.ఆది పినిశెట్టి విలనిజం కూడా అభిమానులను ఆకట్టుకుంది.

మరి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ దేవిశ్రీప్రసాద్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.ఇక ది వారియర్ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకుని కలెక్షన్ లో వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు