Trivikram Srinivas : డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్… ఇక ఆ పని చేయబోతున్నారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.

అయితే ఇటీవల కాలంలో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయని చెప్పాలి.

Trivikram Srinivas Will Take Long Break From Di

ఈ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం గుంటూరు కారం ( Guntur Kaaram ) . ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది.ఇలా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో త్రివిక్రమ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది కానీ ఈ విషయం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో కూడా సినిమా చేయాల్సి ఉండగా పవన్ ఎన్నికలలో బిజీగా ఉన్నారు.

Trivikram Srinivas Will Take Long Break From Di
Advertisement
Trivikram Srinivas Will Take Long Break From Di-Trivikram Srinivas : డైర�

ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి కాస్త లాంగ్ బ్రేక్( Long Break ) ఇచ్చి ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసుకొని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట అందుకే దర్శకత్వానికి కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వబోతున్నారు అయితే ఈ వ్యవధిలో ఈయన తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో చిత్రాలు నిర్మించాలని అనుకుంటున్నారట.ఇతర దర్శకులతో తన బ్యానర్ లో సినిమాలు చేస్తారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

గుంటూరు కారం సినిమా రిజల్ట్ కారణంగా ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు