త్రివిక్రమ్‌ ఏం చేస్తున్నాడు?

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మళ్లీ పనిలో బిజీ అయ్యాడు.

ఇటీవలే ఈయన తర్వాత సినిమాకు హీరోగా నితిన్‌ ఖరారు అయిన విషయం తెల్సిందే.

ఇద్దరు ముగ్గురు హీరోలను పరిశీలించిన తర్వాత నితిన్‌ తన కథకు సూట్‌ అవుతాడని భావించిన దర్శకుడు త్రివిక్రమ్‌ ఇటీవలే కన్ఫర్మ్‌ చేశాడు.ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలను నిర్మించిన రాధాకృష్ణ మరోసారి త్రివిక్రమ్‌తో సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.ఈయన ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను బుక్‌ చేయడం జరిగింది.

సమంత డేట్లు కూడా నిర్మాత తీసుకున్నాడు.ఇక సినిమా కోసం ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది.

Advertisement

వరుస సినిమాలతో హిట్‌ కొడుతూ పోతున్న మాటల మాంత్రికుడు ఈసారి యువ హీరో నితిన్‌ను స్టార్‌ హీరోగా మలచడం ఖాయం అని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

నిన్ను పెట్టి సినిమా తీస్తే ఎవడైనా చూస్తాడా అంటూ తారక్ పై రాజమౌళి ఆగ్రహం
Advertisement