మలీస్టారర్‌ పుకారు : ఇది నిజం అయితే తెలుగు ప్రేక్షకులకు పండగే పండగ

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని మల్టీస్టారర్‌లు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.తాజాగా ‘దేవదాస్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

నాగార్జున మరియు నాని కలిసి నటించిన ఆ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ దక్కింది.మరో వైపు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల కలయికలో రాజమౌళి భారీ ఎత్తున మల్టీస్టారర్‌ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నాడు.

రికార్డు స్థాయి బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.ఇలాంటి సమయంలో మరో మల్టీస్టారర్‌ వార్త సినీ వర్గాల వారితో సహా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలైన తర్వాత త్రివిక్రమ్‌ చేయబోతున్న చిత్రం గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది.త్రివిక్రమ్‌తో మూవీ కోసం ఒక వైపు అల్లు అర్జున్‌ మరో వైపు వెంకటేష్‌లు ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.వీరిద్దరి అభిమానులు కూడా త్రివిక్రమ్‌ తర్వాత సినిమా మా హీరోతోనే అనుకుంటున్నారు.

Advertisement

ఇలాంటి సమయంలో సినీ వర్గాల నుండి ఆసక్తికర పుకారు ఒకటి బయలుజేరింది.

అల్లు అర్జున్‌ మరియు వెంకటేష్‌ల కలయికలో త్రివిక్రమ్‌ ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడట.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కాబోతుందనే టాక్‌ కూడా వినిపిస్తుంది.టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వార్తలను అంతా నమ్ముతున్నారు.

ఈ వార్తలు నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు.ఒక వేళ ఈమల్టీస్టారర్‌ నిజమే అయితే ప్రేక్షకులకు పండుగే పండుగ.

తాజా వార్తలు