మహేష్ బాబు సినిమా కోసం సిమ్రాన్ ని దించుతున్న త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది.

ఈ సారి మహేష్ కోసం త్రివిక్రమ్ ఫ్యామిలీ కథని కాకుండా అతనికి సరిపోయే విధంగా స్పై థ్రిల్లర్ జోనర్ లో కథని సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇందులో మహేష్ బాబు రా ఏజెంట్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది.

Trivikram Choose Simran For Mahesh Babu Movie, Yuvaraju Movie, Tollywood, Pooja

యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు త్రివిక్రమ్ స్టైల్ హ్యూమర్ తో మహేష్ క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తుంది.ఇక సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు ప్రధానంగా వినిపిస్తుంది.

అలాగే రష్మిక మందనని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.అదే సమయంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

Advertisement

ఎవరిని ఎంపిక చేసారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.ఇదిలా ఉంటే గత కొంత కాలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రతి సినిమాలో ఒక ఫిమేల్ క్యారెక్టర్ ని సెంటర్ పాయింట్ చేసుకొని కథలని చెబుతున్నాడు.

అత్తారింటికి దారేది సినిమాలో నదియాని పరిచయం చేశాడు.అలాగే అజ్ఞాతవాసి సినిమాలో కుష్బూని పెట్టాడు.

అఆలో కూడా నదియా పాత్ర కీలకంగా ఉంటుంది.అరవింద సమేత సినిమాలో పూజాహెగ్డే, ముసలమ్మ పాత్రల చుట్టూ నడుస్తుంది.

అల వైకుంఠపురంలో టబు పాత్ర కీలకంగా ఉంటుంది.ఇలా ఫిమేల్ సెంట్రిక్ గా పాత్రలని పెట్టి వారి చుట్టూ కథని చెబుతూ వస్తున్నాడు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

ఈ నేపధ్యంలో మహేష్ బాబు సినిమా కోసం ఆలాంటి కీలక పాత్రలో సిమ్రాన్ ని దించుతున్నట్లు తెలుస్తుంది. సిమ్రాన్ ఇప్పటికే కోలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది.

Advertisement

మహేష్ సినిమాతో తెలుగులోకి ఆమెని మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేయబోతున్నాడని తలిక్ నడుస్తుంది.ఇదిలా ఉంటే గతంలో సిమ్రాన్, మహేష్ జోడీగా యువరాజు సినిమాలో నటించారు.

త్రివిక్రమ్ సినిమాలో ఆమె ఒకే అయితే రెండో సారి అవుతుంది.

తాజా వార్తలు