జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ..నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

టీడీపీ( TDP ) కీలక నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏపీలో ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ఇందులో ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్( Postal Ballot ) ఓట్ల వ్యవహారంలో నేతలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.కౌంటింగ్ పై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

Training Of Counting Agents At The Zonal Level.. Chandrababu's Direction To The

అదేవిధంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలని ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వచ్చే నెల ఒకటోవ తేదీన జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు.

కాగా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిబంధనలపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు