ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.గల్లీలో సవాళ్లు.

ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోలన్నారు.ఇది కేసీఆర్ మ్యాజిక్కు.

జగమెరిగిన ‘నిక్కర్’ లిక్కర్ లాజిక్కు అంటూ ఎద్దేవా చేశారు.అయితే కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందన్న ఎమ్మెల్సీ కవిత అప్పుడు ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ కానీ ఇప్పుడు వయా బెంగళూరు అంటూ విమర్శలు చేశారు.దాంతోపాటు హస్తం పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటూ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...