శ్వేత పత్రం విడుదల దిశగా టి . కాంగ్రెస్?

అనేక అంచనాల నడుమ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఇప్పుడు హామీలు అమ్ములు పెద్ద గుదిబండ గా మారినట్లు తెలుస్తుంది.

ముఖ్యంగా నభూతో అన్న రీతిలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు హామీలను ఇచ్చాయి.

బిఆర్ఎస్ ను మించి ఇవ్వాలనే తాపత్రయం లో కాంగ్రెస్ అలవిగాని హామీలనే ఇచ్చిందిఅని చెప్ప వచ్చు .ప్రస్తుతం తెలంగాణ ఖజానా మాత్రం ఈ హామీల అమలుకు ఏమాత్రం సరితూగేటట్టు కనిపించకపోవడంతో, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల వరకు ప్రజలలో అసంతృప్తి రాకుండా హామీలను వాయిదా వేయడం ఎలా అన్నదానిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి .ముఖ్యంగా విద్యుత్ శాఖ తో పాటు అనేక శాఖలలో భారీ ఎత్తున అప్పులు పేరుకుపోయి ఉండడంతో ఇప్పుడు శాఖల వారి రిపోర్టులు తిరగేసే పని లో కాంగ్రెస్ వర్గం పడినట్లుగా తెలుస్తుంది.దాంతో రానున్న అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకొని ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులు జరిగిన తప్పులపై పై ఒక పూర్తిస్థాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గాని లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుపై సమగ్రమైన శ్వేత పత్రాన్ని కానీ విడుదల చేయాలని తద్వారా హామీల అమలును వాయిదా వేసినా కూడా ఎక్కడా వ్యతిరేకత రాకుండా చూసుకోవాలని ధీర్ఘ కాల వ్యూహాన్ని రేవంత్ అమలు చేయబోతున్నారని మీడియా సర్కిల్లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.

తద్వారా బిఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తున్న అభివృద్ధి అంతా అప్పుల పునాదులపై పడిందని , ఈ స్థాయి భారీ అప్పులు తీర్చాలంటే తమ ఐదు సంవత్సరాల సమయం కూడా సరిపోదు అన్న అంచనాకు వచ్చిన రేవంత్ వర్గం దానిని తెలంగాణ ప్రజలకు సవివరంగా వివరించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.తద్వారా హామీరా అమలులో ఎక్కడైనా ఒకటి రెండు పొరపాట్లు జరిగినా ఆర్థిక పరిస్థితిసహకరించట్లేదని ప్రజలు సరిపెట్టుకుంటారన్న ఆలోచన లో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది.మరి కాంగ్రెసు ప్రచారాని ప్రదాన ప్రతిపక్షం బారతీయ రాష్ట్ర సమితి ఎలా ఎదుర్కుంటారో చూడాలి .

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు