రాజమౌళి కాపి కొట్టిన టాప్ సినిమాలు / సీన్స్

కాపి అంటే కొంచెం నాటుగా ఉంటుందేమో .స్ఫూర్తి పొందడం అంటే కొంచెం క్లాస్ గా ఉంటుందేమో.

ఏదైతే ఏమి .రాజమౌళి సినిమాల్లో అన్ని పూర్తిగా ఒరిజినల్ ఆలోచనలు మాత్రం ఉండవు.కొంచెం తన సొంత క్రియేటివిటి ని, ఇంకొంచెం స్ఫూర్తి పొందిన అంశాలను కలిపి మనకు నచ్చేలా రుబ్బి రుబ్బి వడ్డించడం జక్కన్న స్పెషాలిటి.

సో, ఈరోజు మన రాజమౌళి కాపి కొట్టిన లేదా స్పోర్తి పొందిన కొన్ని సినిమాలు/ సీన్స్ ఏంటో చూద్దాం.* బాహుబలితో మొదలుపెడితే .క్లయిమాక్స్ లోని యుద్ధ సన్నివేశంలో కాలకేయుల నాయకుడు తన మనుషులలో కొందరిని బాహుబలి మీదికి విసురుతాడు.వారంతా బాహుబలి మీద కుప్పలు కుప్పలుగా పడిపోతారు.

కాని బాహుబలి తన బలాన్ని చూపించి పైకి లేవగానే వారంతా చెల్లాచెదురుగా పడిపోతే, బాహుబలి చేతిలో సింహం తల ఆకారంలో ఓ ఆయుధం ఉంటుంది.ఇప్పుడు ఈ విడియోని 1:30 నిమిషాల దగ్గరినుంచి చూడండి.గాడ్ ఆఫ్ వార్స్ విడియో గేమ్ నుంచి తీసుకున్న షాట్ అది.* బాహుబలి గురించి ఇంకొంచెం మాట్లాడుకుంటే .రెండోవభాగంలోని యుద్ధసన్నివేశంలో భాల్లాలదేవుడు శివుడి మీదకి తన రథంతో దూసుకువస్తోంటే, బాహుబలి తన చేతిలో ఆయుధంతో ముందున్న చక్రాలను విరగొట్టి, దున్న మీద అడుగుపెట్టి భాల్లాలుడి వైపు ఆయుధాన్ని ఎక్కుపెడతాడు.మనల్ని ఎంతగానో అలరించిన ఈ షాట్ ని మహాభారతానికి గుర్తుగా చెక్కిన కర్ణుడి విగ్రహ నమూనా నుంచి తీసుకున్నారు.

Advertisement

* బాహుబలి మొదటి భాగంలోని త్రిశుల వ్యూహం నమూనా, భాల్లాలదేవుడి చక్రాల రథం, బాహుబలి రెండోవ భాగం చివర్లో బాణాల వర్షం ముందు ప్రభాస్ నిల్చోవడం .ఈ మూడు కూడా హాలివుడ్ సినిమా హర్క్యులేస్ నుంచి తీసుకున్నవి.* ఈ ఫోటో చూస్తోంటే బాహుబలి 2 లో శివుడు యుద్ధానికి బయలుదేరే ముందు ప్రజలంతా శివుడిపై చేతులు వేయడం గుర్తుకు రావడం లేదు ? ఈ షాట్ బ్యాట్ మెన్ vs సూపర్ మెన్ సినిమాలోది.* విక్రమార్కుడులో విలన్ కొడుకు పిచ్చివాడిలా యాక్ట్ చేయడం .పోలీసులని బెల్టు విప్పమని చెప్పడం, కాలుజారి బిల్డింగ్ మీది నుంచి పడుతూ, పోలీసు బెల్టుకే ఉరిపడి చనిపోవడం .ఈ సీన్ గుర్తుందా ? ఇప్పుడు విజయశాంతి నటించిన శాంభవి IPS సినిమాలోని ఈ సీన్ చూడండి.* ఈగను హీరోగా పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు రాజమౌళి.ఈ ఈగకు ఇన్స్పిరేషన్ కాక్రోచ్ అనే షార్ట్ ఫిలిం.ఈ విడియో 5:20 నిమిషాల నుంచి చూడండి .మీకు ఈగలో సమంతకు తానే మళ్ళీ పుట్టానని కన్నీళ్ళతో ఈగ రాసే సీన్ గుర్తుకు వస్తుంది.

cockroach 5:20

* రాజమౌళి ఇప్పటివరకు రీమేక్ చేయలేదు కాని ఫ్రీమేక్ మాత్రం చేసారు.1923 లో వచ్చిన అవర్ హాస్పిటాలిటి సినిమాని తెలుగు వారికి తగ్గట్టుగా మార్పులు చేసి అందించారు జక్కన్న.* కొత్త రాజమౌళిని మనకు చూపించిన మగధీర 300 సినిమా నుంచి స్ఫూర్తి పొందింది.

ఈ సినిమా కథకు మూలాధారమైన వంద మంది ఫైట్ ఎపిసోడ్ 300 సినిమా నుంచి కొంచెం అటుఇటుగా తీసేసుకున్నారు.అక్కడ 300 మంది ఒక దారిలో వేలమంది సైనికులతో పోరాడితే, ఇక్కడ ఒక్కడు అలాంటి సన్నటి దారిలో వంద మందితో పోరాడతాడు.

ఆ సీన్ లో కొన్ని షాట్స్ ని కూడా 300 నుంచే తీసుకున్నారు.

నటుడు చంద్రమోహన్‌ కి సైతం ఛాలెంజ్ చేసిన సీన్‌ కేవలం ఇది మాత్రమే .. !
Advertisement

తాజా వార్తలు