గొప్ప నటులుగా పేరు తెచ్చుకుంటున్న టాప్ డైరెక్టర్స్ వీళ్లే...

చాలా మంది డైరెక్టర్లు( Directors ) మంచి సినిమాలు తీసి డైరెక్టర్లుగా మంచి గుర్తింపు పొందుతూ ఉంటారు అయితే వాళ్ళు సినిమాలు తీయడమే కాకుండా సినిమాల్లో నటించి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ లు కూడా తీసుకుంటున్నారు అలా ముందు డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లో నటించి నటులుగా మంచి గుర్తింపు పొందిన వాళ్ల గురించి తెలుసుకుందాం.

సముద్రఖని

ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో కొన్ని సినిమాలు డైరెక్షన్ చేసి ఆ తర్వాత నటుడిగా మారి తన నటన తో అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన వ్యక్తి సముద్రఖని( Samudrakhani ) ఈయన అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన అలా వైకుంఠపురం లో సినిమాలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎస్ జె సూర్య

తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి సినిమాతో తెలుగు లో కూడా సూపర్ హిట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఎస్ జె సూర్య,( SJ Surya ) ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ప్లాపులు రావడం తో డైరెక్షన్ వదిలేసి నటుడిగా కొన్ని సినిమాలు చేశాడు ఆయన నటన నచ్చిన జనాలు ఆయన సినిమాలని బాగా ఆదరించారు అలాగే ఆయనకి నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి.దాంతో ప్రస్తుతం టాప్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు.

రిషబ్ శెట్టి

కన్నడ హీరో అయిన రిషబ్ శెట్టి( Rishab Shetty ) మొదట కొన్ని సినిమాలకి డైరెక్షన్ చేశాడు ఇక ప్రస్తుత ఆయన సినిమాలని ఆయనే డైరెక్షన్ చేస్తూ నటిస్తున్నాడు.లేటెస్ట్ గా వచ్చిన కాంతార సినిమా తో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు.

రాజ్ బి శెట్టి

Advertisement

ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకి ఎక్కువగా తెలియదు ఎందుకంటే ఈయన ఒక కన్నడ డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్. అలాగే ఈయన తీసిన గరుడ గమన వృషభ వాహన సినిమా తో మంచి హిట్ అందుకున్నాడు అలాగే ఈ సినిమాలో ఒక మేజర్ క్యారెక్టర్ చేసిన ఆయన నటుడిగా కూడా తన సత్తా చాటుకున్నాడు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు