రక్షణ సమాచారం శత్రువుల చేతికి: కెనడా అత్యున్నత నిఘా అధికారి అరెస్ట్

దేశ రక్షణ సమాచారంతో పాటు భద్రతకు సంబంధించిన కీలక విషయాలను ఉగ్రవాద సంస్థలకు అందించాడన్న అభియోగాలపై కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన అత్యున్నత అధికారిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సదరు అధికారిని కెమెరూన్ ఓర్టిస్‌గా వెల్లడించారు.

ఇతనిపై సెక్యూరిటీ ఆఫ్ ఇన్ఫ్‌ర్మేషన్ చట్టంతో పాటు కెనడా క్రిమినల్ కోడ్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీస్ శాఖ వెల్లడించింది.

  47 ఏళ్ల ఓర్టీస్ బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి 2006లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగంలో డాక్టరేట్ పొందాడు.చైనీస్, మాండరీన్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల సత్తా అతని సొంతం.2007లో రాయల్ కెనడీయన్ పోలీస్ శాఖలో చేరిన ఓర్టీస్.ఆపరేషన్స్ రీసెర్చ్ , నేషనల్ సెక్యూరిటీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌ విభాగంలో కీలక హోదాలో పనిచేస్తున్నారు.

ఓర్టిస్ ఒక పరికరం సాయంతో అత్యంత కీలకమైన డిజిటల్ డేటాను దొంగిలించి దానిని ఇతరులతో పంచుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.విచారణ నిమిత్తం ఓర్టిస్‌ను శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

Advertisement

  మరోవైపు తమ దేశానికి చెందిన నిఘా అధికారి.దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను శత్రువులకు, ఉగ్రవాదులకు చేరవేస్తున్నారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు.అయితే ఈ రహస్య సమాచారం శత్రువుల చేతికి చిక్కడంతో కెనడాతో నిఘా వ్యవహారాలు పంచుకునే యూకే, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌లపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న దానిపై ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

తాజా వార్తలు