ప్రభాస్ మీద అంత ఏడుపు ఎందుకు ఈ హీరోకి?

బాహుబలి సక్సెస్ లో ప్రభాస్ పాత్ర తక్కువే అన్నా, ప్రభాస్ ని పూర్తిగా పక్కనపెట్టేసి రాజమౌళికే క్రెడిట్ అంతా ఇచ్చినా, ఎవరు వాదించలేని లేదా కాదనలేని నిజం ఏమిటంటే ప్రభాస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ స్టార్.

ఇకనుంచి ఇటు హిందీలో, అటు తమిళ, మళయాళ భాషల్లో తన సినిమాలు విడుదల చేయగల పేరు, మార్కేట్ సంపాదించుకున్నాడు రెబల్ స్టార్.

ఈ గుర్తింపుకి ప్రభాస్ పూర్తిగా అర్హుడు.ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సంవత్సరాలు బాహుబలి ప్రపంచంలో, రామోజి ఫిలింసిటిలో వేసిన మాహిశ్మతి సెట్లో గడిపాడు ప్రభాస్.

కాని ఈ విషయాన్ని ఓ హీరో జీర్ణించుకోలేకపోతున్నాడని తెలుస్తోంది.సహజంగానే ఇండస్ట్రీలో ఈ హీరో మీద ఓ బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది.

ఇప్పుడు ఆ అభిప్రాయం ఇంకా బలపడుతోంది.ఎందుకంటే ఆయన చేష్టలు అలా ఉన్నాయి.

Advertisement

కొన్ని నేషనల్ మీడియా వెబ్ సైట్స్ లో కొత్త ఆర్టికల్స్ రాబోతున్నాయి.ఈ హీరోకి బాలివుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నట్లుగా, హిందీ నిర్మాత దర్శకులు సినిమా తీసేందుకు తహతహలాడుతున్నట్లుగా వార్తలు రాబోతున్నాయి.

ఆ కథనాల కోసం వారికి అందాల్సిన డబ్బు ఇప్పటికే అందిందట.ఇలా ఫేక్ చేయడం ఈ హీరోకి కొత్తేమి కాదని ఫిలింనగర్ జనాలు మాట్లాడుకుంటారు.

తన సినిమాల కలెక్షన్లు ఎక్కువ చూపించటం కూడా బాగా అలవాటే.ఇప్పుడేమో ప్రభాస్ సక్సెస్ ని తట్టుకోని నిలబడేందుకు ఈ ప్రయత్నాలు.

అంత ఈగో ఎందుకో మరి.

మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ? 
Advertisement

తాజా వార్తలు