Telugu movies : లాజిక్ లేని సీన్లతో వచ్చి నవ్వుల పాలైన 10 తెలుగు సినిమాలు ఇవే..!

సినిమాల్లో హీరోల ఎలివేషన్ సీన్లు అభిమానులకు బాగా కిక్కెక్కిస్తాయి.అందుకే స్టార్ హీరోల సినిమాలలో ఆ ఎలివేషన్లు సన్నివేశాలు ఉండేలా దర్శకులు జాగ్రత్త పడతారు.

అయితే, కొన్ని సార్లు ఈ సీన్లు లాజిక్‌ లేకుండా చాలా అసహజంగా ఉంటాయి.వాస్తవానికి చాలా దూరంగా సిల్లీగా అనిపిస్తాయి వాటిని చూస్తే ఎవరైనా సరే ఇలాంటి సీన్లు ఎలా తీస్తారు అసలు అని ఆశ్చర్య పోతుంటారు.

అయినా దర్శకులు ధైర్యం చేసి అలాంటి సిల్లీ సన్నివేశాలనే ఎలివేషన్స్ సీన్లుగా సినిమాల్లో పెట్టేసి రిలీజ్ చేస్తుంటారు.ఇలా వచ్చిన సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి.

వాటిలో పది సినిమాలు ట్రూలర్స్ బారిన పడ్డాయి.నవ్వుల పాలు అయ్యాయి అవేవో తెలుసుకుందాం పదండి.

Advertisement

• ప్రాణానికి ప్రాణం

( Prananiki Pranam ) బాలకృష్ణ జైలులో ఉండగా హీరోయిన్‌కి తాళి కడతాడు.జోక్ ఏంటంటే ఒక ఊచ మధ్యలో నుంచి ఆమెకు అతడు తాళి కడతాడు.

కానీ ఆ తాళి జైలు ఊచ చుట్టూ చిక్కుకుపోతుంది.ఆ తర్వాత బాలయ్య ఊచలు విరిచి తాళిని తీసుకుని హీరోయిన్‌కి ఇస్తాడు.

ఎంత బలశాలి అయినా ఆ పని చేయడం అసాధ్యం.అందుకే ఈ సన్నివేశం చూసి ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు.

దీనిని సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రోల్ కూడా చేశారు.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

• ఇంద్ర

( Indra ) ఇక ఇంద్ర సినిమాలో హీరో చిరంజీవి హెలికాఫ్టర్‌లో ఉండగా కింద ట్రైన్‌లో ఉన్న విలన్స్‌ను చూస్తాడు.ఇది సాధ్యం కాని విషయం.

Advertisement

• మాస్

( Mass ) నాగార్జున ఫైట్ సీన్‌లో కాలితో దుమ్ముని లేపుతారు, ఇది సినిమాటిక్ ఎలివేషన్.నిజ జీవితంలో ఎవరి వల్ల కానీ ఒక లాజిక్ లేని సీను ఇది.

• ఒకే ఒక్కడు

( Oka okkadu ) అర్జున్ ఒక జర్నలిస్ట్‌గా ఉండి, ఒక్క రోజు ముఖ్యమంత్రిగా మారతారు, ఇలాంటి ఘటన నిజ జీవితంలో జరిగే ఛాన్స్ లేదు.

• అల్లుడా మజాకా

( Alluda majaka ) చిరంజీవి ఫైట్ సీన్‌లో ఎలివేషన్ ఉంటుంది.అది నేచురల్ గా అనిపించదు.

• జులాయి

( Julai ) మంత్రి మరణించినా, పోలీసులు టీవీలో చూసి తెలుసుకుంటారు.సాధారణంగా పోలీసులకు టీవీల కంటే ముందే సమాచారం వెళ్ళిపోతుంది.సో ఈ సిల్లీ సన్నివేశాన్ని పెట్టి త్రివిక్రమ్ నవ్వుల పాలయ్యాడు.

• అత్తారింటికి దారేది

( Attarintiki Daredi ) పవన్ కళ్యాణ్ రైల్వే స్టేషన్‌ను కొనుగోలు చేస్తాడు, నిజానికి అంత కోటీశ్వరుడైనా కొనగలిగే స్తోమత ఉన్న ఇలా రైల్వే స్టేషన్లను ప్రభుత్వం అమ్మదు.సో ఇది నిజ జీవితంలో జరగదు.కాబట్టి ఆడియన్స్ నవ్వుకున్నారు.

• వినయ విధేయ రామ

( Vinaya Vidheya Rama ) రామ్ చరణ్ ట్రైన్‌పై నుంచి బీహార్ వెళ్తారు, ఇది అతిశయోక్తిగా అనిపిస్తుంది.

•ఆగడు

( Agadu ) మహేష్ బాబు రన్నింగ్ ట్రైన్ బోగీల మధ్య నుంచి జంప్ చేస్తారు.ఇలా చేయడం నిజ జీవితంలో ఎవరి తరం కాదు.

• బాహుబలి

( Bahubali ) యుద్ధం సమయంలో తాటి చెట్లను వంచి కోటలోకి దూకే సీన్ చిన్నపిల్లల కార్టూన్ సీన్ వలే అనిపిస్తుంది.అంతటి దిగ్గజా రాజమౌళి ఇలాంటి సిల్లీ సన్నివేశం పెట్టాడు.దాని కారణంగా అతడిని ట్రోల్ కూడా చేశారు.

అయినా మూవీ సూపర్ హిట్ అయింది.

తాజా వార్తలు