నిన్నటితరం ఈ కమెడియన్ పాపం, రైలు పట్టాలపైన శవమై తేలాడు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు రాజబాబు, రేలంగి, పద్మనాభం లాంటి స్టార్ కమెడియన్ ఉండేవారు.

అయితే వీళ్ల గురించి చాలామందికి తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వాళ్ల హావభావాలతో జనాలంధరనీ నవ్విస్తూ ఫ్లాప్ అయ్యే సినిమాలను సైతం కొన్ని సందర్భాల్లో వాళ్ళ కామెడీతో హిట్ చేసిన కమెడియన్స్ వీళ్లు.

అయితే వీళ్ళ తర్వాత ఇండస్ట్రీలో అంత గొప్ప పేరు సంపాదించిన కమెడియన్స్ లో బ్రహ్మానందం ఒకరు.ఆయన చేసిన సినిమాలు దాదాపు హిట్ గా నిలిచాయి.

వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో తన పేరు నమోదు చేసుకున్న బ్రహ్మానందం గారిని స్క్రీన్ మీద చూస్తేనే నవ్వే జనాలు చాలామందే ఉన్నారు.ఆయన టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరోతో నటించి తనదైన మార్కు కామెడీతో ప్రేక్షకుల అందరినీ అలరించారు.

ముఖ్యంగా జంధ్యాల గారి సినిమాల్లో ఆయన చేసిన కామెడీకి మంచి పేరు వచ్చింది ఆహా నా పెళ్ళంట సినిమా లో అరగుండు క్యారెక్టర్ లో ఆయన చేసిన హావభావాలు ప్రేక్షకులందరికీ కడుపుబ్బ నవ్వించాయి.ఆయనతో పాటు తెలుగు చలన చిత్రసీమలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు.

Advertisement

చాలా మందికి తెలియని ఒక కామెడీయన్ కూడా ఉన్నాడు ఆయనే కె వి చలం.ఈయన తనదైన మార్కు కామెడీతో అప్పట్లో జనాలని అలరించారు వీలు దొరికినప్పుడల్లా సెట్లో కూడా జోకులు చెప్పి తన కో ఆర్టిస్టుల అందరిని నవ్వించే వాడు.చలం ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ లో మాట్లాడుతూ కామెడీతో జనాలని రంజింపజేసే వాడు.

రష్యా, మలయాళం వంటి భాషలతో జనాలని రంజింపచేసే వాడు చలం గారిని దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు ఎక్కువగా ప్రోత్సహించారు.ఆయన సినిమాల్లో చలం చేసే వీలు లేకపోయినా ఆయన కోసం ఒక క్యారెక్టర్ని రాసుకుని ఆయనతో పాటు చేయించుకునేవారు.

దర్శకరత్న దాసరి నారాయణరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే అప్పట్లో ఆయన తీసే ప్రతి సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అయ్యేది ప్రేమాభిషేకం లాంటి సినిమా అయితే సంవత్సరం రోజుల పాటు ఆడింది అంటే దాసరి నారాయణరావు గారు ఇలాంటి సినిమాలు తీసేవారు.తెలుగు చలన చిత్ర సీమలో 150 సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు.

ఆయన తీసిన సినిమాలు అయిన చిల్లర కొట్టు చిట్టెమ్మ, శివరంజని, అద్దాలమేడ, సర్కస్ రాముడు వంటి ఏన్నో సినిమాల్లో కె.వి చలానికి దాసరి నారాయణరావు మంచి హాస్య పాత్రలు ఇచ్చాడు.అయితే చలం ఒకరోజు రాత్రి రైలు పట్టాలు దాటుతూ రైలు కిందపడి మరణించాడు ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి అయిపోయింది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

తెలుగు సినిమాల్లో నటించే నటుడు ఇలా చనిపోవడం ఎవరు జీర్ణించుకోలేకపోయారు.అప్పుడు దాసరి నారాయణరావు అద్దాలమేడ సినిమా చేస్తున్నారు ఆయన అయితే ఈ విషయం నిజం కాదేమో ఊరికెనే అంటున్నారు ఏమో అనుకున్నారట కానీ చలం చనిపోయిన విషయం నిజమే అని తెలిసిన తర్వాత దాసరి గారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆయన శవాని కి అంతిమయాత్ర చాలా ఘనంగా నిర్వహించారు తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా దాసరిగారు ఆర్థికంగా ఆదుకున్నారు.

Advertisement

అప్పట్లో దాసరిగారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యి ఇండస్ట్రీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేవారు.అయితే కె వి చలం లాంటి మంచి ఆర్టిస్ట్ ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కోల్పోయిందని దాసరి గారు అప్పుడు చాలా బాధ పడ్డారు.

ఆయన తర్వాత చాలామంది కమెడియన్స్ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తనలాంటి కామెడీని చేసేవారు ఇండస్ట్రీలో కరువయ్యారు.ప్రస్తుతం చాలా మంది కమెడియన్స్ వాళ్ల వాళ్ల యాక్టింగ్ తో నటిస్తూ జనాలను అలరిస్తున్నప్పటికీ కె.వి.చలం లేని లోటు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో అలాగే ఉంది అని చెప్పొచ్చు.

తాజా వార్తలు