Ram charan upasana : పెట్స్ తో సందడి చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్

టాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్స్ అందరికీ సినిమా ఎంత జ్ఞాపకమో పెడ్స్ తో గడపడం కూడా అంత ఇష్టం.

ఇటీవల ప్రతి సెలబ్రిటీ కుక్కతో దర్శనమిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

మహేష్ బాబు దగ్గర నుంచి సమంత, కీర్తి సురేష్, రామ్ చరణ్ ఇలా వివిధ రకాల హై క్లాస్ బ్రీడ్స్ పెట్స్ ని కొని పెంచుతున్నారు.వీటితో ఫోటోలు దిగుతూ ఫోజులిస్తూ పెంచుకుంటున్నారు.

మరి తాజాగా టాలీవుడ్ లో పెట్స్ తో దర్శనం ఇచ్చి మీడియా అటెన్షన్ దక్కించుకున్న ఆ సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం.

మహేష్ బాబు

మహేష్ బాబు( Mahesh babu ) ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఏ రకమైన పెట్ తో కనిపించలేదు.కానీ మొట్ట మొదటి సారి ఒక పిల్లి పిల్లను బుజ్జగిస్తూ ఉన్నటువంటి ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అది చూడ్డానికి ఎంతో అందంగా ఉంది.

Advertisement

దానికి My Kleo అనే క్యాప్షన్ పెట్టాడు.ప్రస్తుతము కుటుంబంతో కలిసి వెకేషన్ లో ఉన్న మహేష్ బాబు ఈ పిక్ పెట్టడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత మొట్టమొదటిసారి ఒక సినిమా ప్రమోషన్ కి కుక్క పిల్లను తీసుకొని హాజరవడం అందరికీ ఆశ్చర్యాన్ని ఇచ్చింది.ఇటీవల శాకుంతలం సినిమా ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్న సమంత తన పెట్ తో పాటు పాల్గొంది.

ఇక సమంతకు పెళ్లికి ముందు నుంచి కుక్క పిల్లలను పెంచడం అలవాటు తన పిల్లలు వీళ్లే అన్నట్టు గా కుక్కలకు ప్రాధాన్యత ఇస్తుంది.

కీర్తి సురేష్

కీర్తి సురేష్( Keerthy Suresh ) దసరా సినిమా షూటింగ్ సమయంలో నుంచి ఎక్కువగా తన పెట్ తో కలిసి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వస్తోంది.ముద్దులొలికే ఆ కుక్క కు పర్సనల్ స్టాఫ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.షూటింగ్ గ్యాప్ దొరికింది అంటే చాలు తన క్యారవాన్ లో ఆడుకుంటూ వీడియోలు పెట్టింది కీర్తి సురేష్.

రామ్ చరణ్

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable

ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ ఉపాసన దంపతులు( Ram charan ) ఎక్కడ కనిపించినా ఆ తన అందమైన కుక్క పిల్ల రైమో తో కలిసి కనిపిస్తున్నారు.ఇటీవల వెకేషన్ నుంచి ఈ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తిరిగి ఎయిర్పోర్టుకు రాగా వారికి వెల్కమ్ చెప్పడానికి వెళ్లి రాంచరణ్ తో చాలా సేపు దోబూచులాడిన కుక్క పిల్లను చాలా మంది ఇష్టపడుతున్నారు.ఇక తన కుక్క పేరుతో ఒక ఇంస్టాగ్రామ్ పేజ్ కూడా రన్ చేస్తున్నాడు రామ్ చరణ్.

Advertisement

తాజా వార్తలు