ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?

సినిమాల్లో నటించే వాళ్ళు చాలా అన్ని చదువు అబ్బక తమకున్న టాలెంట్ తో ఈ రంగంలో రాణించాలని చాలామంది ఉత్సాహం చూపుతుంటారు.

ఆ విధంగా చూస్తే కొందరు నటులు చదువు లేకపోయినా తమకున్న టాలెంటుతో సినిమాలు చేస్తూ లక్షలాది అభిమానులను సంపాదించుకుంటున్నారు.

కానీ మరికొంత మంది నటులు పెద్ద చదువులు చదివినా కూడా సినిమా రంగంలో నటిస్తున్నారు.అందులో భాగంగా చూస్తే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా సినిమా రంగంలో ఉన్నారు.

తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ఇంతకీ వాళ్ళు ఎవరు ఈ ఆర్టికల్ లో చూద్దాం.

మొదటగా చూస్తే అక్కినేని నట వారసుడు అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో మేటి నటుడిగా కొనసాగుతున్నారు.అయితే నాగార్జున తన ఇంజనీరింగ్ చదువును చెన్నైలో పూర్తి చేశారు.

Advertisement
Tollywood Stars Who Have Studied B Tech Engineering , Tollywood Stars Education,

చదువును పూర్తి చేసిన అనంతరం సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరో గా సత్తా చాటుతున్నారు.అలాగే బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయినా ప్రభాస్ కూడా ఇంజనీరింగ్ చదివారు తన ఇంజనీరింగ్ హైదరాబాద్ లో పూర్తి చేశారు.

హ్యాపీ డేస్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కూడా తన ఇంజనీరింగ్ చదువుని హైదరాబాద్ లోనే పూర్తి చేశారు.

Tollywood Stars Who Have Studied B Tech Engineering , Tollywood Stars Education,

అలాగే గూడచారి వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న అడవి శేషు తన ఇంజనీరింగ్ చదువు ని అమెరికాలో పూర్తి చేశారు.అలాగే ఇటీవల సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో అలరించిన సాయి ధరమ్ తేజ్ కూడా తన ఇంజనీరింగ్ చదువు ని నెల్లూరులో పూర్తిచేశాడు.అలాగే నటుడు మరియు దర్శకుడైన అవసరాల శ్రీనివాస్ కూడా తన ఇంజనీరింగ్ చదువు ఒక ప్రముఖ యూనివర్సిటీలో పూర్తిచేశారు.

Tollywood Stars Who Have Studied B Tech Engineering , Tollywood Stars Education,

వీళ్లే కాకుండా హీరోయిన్స్ లో నభా నటేష్ తన ఇంజనీరింగ్ చదువును బెంగళూరులో పూర్తి చేశారు.మరియు కలర్స్ ప్రోగ్రాం ద్వారా మంచి పేరు సంపాదించిన స్వాతి రెడ్డి తన ఇంజనీరింగ్ చదువును హైదరాబాద్ లో పూర్తి చేశారు.అలాగే పెళ్లి చూపులు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన రీతువర్మ తన ఇంజనీరింగ్ చదువు హైదరాబాద్ లో పూర్తి చేశారు.

ఇంట్లో చీమ‌లు ఇరిటేట్ చేస్తున్నాయా..?అయితే ఈ టిప్స్ మీకే!

అదండి నటులు వారి యొక్క ఇంజనీరింగ్ చదువులు ఈ ఆర్టికల్ ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను.

Advertisement

తాజా వార్తలు