40-50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేము స్టార్ యాక్టర్స్.. రీజన్స్ ఏంటో తెలిస్తే..

సామాన్య ప్రజలు కనీస వివాహ వయసు దాటిన సమయం నుంచే పెళ్లి చేసుకోవడం మొదలు పెడతారు.35 ఏళ్లలోపే పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని భావిస్తారు.

కానీ సినీ సెలబ్రిటీలు మాత్రం ఇందుకు చాలా భిన్నం.

వారు కావాలనుకుంటే వెంటనే పెళ్లి చేసుకోగలరు.భార్యతో పాటు ఎంతమంది పిల్లలనైనా పోషించగల డబ్బులు వారి దగ్గర ఉంటాయి.అయినా సరే వాళ్లు పెళ్లిని ఆలస్యం చేస్తూ వస్తున్నారు.40 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గానే ఉంటున్నారు.వాళ్లు ఎవరో, పెళ్లి చేసుకోపోవడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం.

ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించారు.కానీ ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో బాలీవుడ్ లో చాలా మంచి ఆఫర్లు వచ్చాయి.పెళ్లి చేసుకుంటే ఒకవైపు కెరీర్‌, మరోవైపు మ్యారేజ్ లైఫ్ కూడా దెబ్బతింటుందని అనుకున్నారు.అందుకే కొన్ని రోజులు తన మ్యారేజ్ ని వాయిదా వేశారు.2-3 ఏళ్లలో కచ్చితంగా ఆయన పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.అయితే ఇప్పుడు ప్రభాస్‌కు 44 ఏళ్లు ఇంకొన్ని రోజుల్లో ఆయన 45 ఏళ్లు వస్తాయి.

సల్మాన్ ఖాన్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) వయసు ప్రస్తుతం 58 ఏళ్లు.ఈ హీరో చాలామందితో డేటింగ్ చేశారని అంటారు.అయితే ఒక అమ్మాయిని సీరియస్ గా లవ్ చేశాడంట.

Advertisement

ఆమెనే పెళ్లి చేసుకోవాలని సల్మాన్ ఖాన్ భావించాడు కానీ వీరి పెళ్లి జరగలేదు.ఆ అమ్మాయి వేరే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

దానితో ఇక సింగిల్‌గానే ఉండాలని సల్మాన్ ఖాన్ డిసైడ్ అయినట్లు సమాచారం.ఒక ఇంటర్వ్యూలో బాయ్ జాన్ మాట్లాడుతూ తానకు పెళ్లి చేసుకునే వయసు ఎప్పుడో దాటిపోయిందని, ఇంకేం పెళ్లి అన్నట్లు కామెంట్లు చేశారు.

ఈ మాటలు విన్నాక ఈ హీరో ఇకపై పెళ్లి చేసుకోరేమో అని అందరూ అభిప్రాయపడుతున్నారు.

సుబ్బరాజు

మిర్చి, బాహుబలి, గీత గోవిందం, మజిలీ సినిమాల్లో నటించే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సుబ్బరాజు( Subbaraju ) వయసు ప్రస్తుతం 47 ఏళ్లు.ఈ భీమవరం పిల్లోడు ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు.ఎందుకు అని అడిగితే తనకు ఇప్పటిదాకా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం రాలేదని, అవసరం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటానని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

హర్ష వర్ధన్

How KYC, Fast Payouts And Self‑Exclusion Work For Crypto Users At WPT Global (Canada)
High Roller Tipps & Casino

అమృతం సీరియల్ తో ఫుల్ ఫేమస్ అయిన హర్ష వర్ధన్( Harsha Vardhan ) కూడా ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు.ఆయనకు పెళ్లిపై ఇంట్రెస్ట్ లేకపోవడమే అందుకు కారణం.

Advertisement

తాజా వార్తలు