మంచి మనసుతో కరోనా ఇష్యూ నెత్తికి ఎత్తుకున్న మన స్టార్స్‌

ఇన్ని రోజులు భయం లేకుండా బతికేసిన హైదరబాదీలు ఒక్కసారిగా భయాందోళనల మద్య మగ్గుతున్నారు.కరోనా వైరస్‌ కారణంగా తెలుగు రాష్ట్రాలు పూర్తిగా టెన్షన్‌ పడుతున్నాయి.

హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ బాధితుడిని గుర్తించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుంది.ఈ సమయంలోనే సామాన్యులను ఎడ్యుకేట్‌ చేసేందుకు ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది.

ప్రభుత్వంతో పాటు సినీ ప్రముఖులు కూడా కరోనాకు దూరంగా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేస్తున్నారు.

కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే వెళ్లాలని, అన్ని విధాలుగా పిల్లలకు మరియు పెద్దలకు సేఫ్టీ పాటించాలంటూ ప్రచారం చేస్తున్నారు.రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన నుండి ఇంకా పలువురు సినీ ప్రముఖులు సుమ నుండి పలువురు బుల్లి తెర ప్రముఖులు కరోనా వైరస్‌ అవగాహణ ప్రచారంను నిర్వహిస్తున్నారు.కరోనా వ్యాదిగ్రస్తులు ఎక్కడైనా కనిపించినా కూడా వెంటనే సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.

Advertisement

టాలీవుడ్‌తో పాటు సామాన్యులు కూడా సోషల్‌ మీడియాలో కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తు తీసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు.కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న వారికి సాధ్యం అయినంత మేరకు దూరంగా ఉండాలని అంటున్నారు.విదేశాలకు వెళ్లి వచ్చే వారితో కలవడం కూడా ప్రమాదమే అంటున్నారు.

మొత్తానికి కరోనా లక్షణాలతో తెలుగు రాష్ట్రాల్లో హై ఎలర్ట్‌ ప్రకటించారు.

Advertisement