ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!

ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ( PV Sindhu ) .రీసెంట్‌గా వెంకట దత్త సాయిని పెళ్లి చేసుకుంది.

రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.ఈ పెళ్లి వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొని సందడి చేశారు.

అయితే తాజాగా ఈమె హైదరాబాదులో ఎంతో ఘనంగా రిసెప్షన్( Reception ) వేడుకను నిర్వహించారు.ఈ రిసెప్షన్ వేడుకలో భాగంగా ఎంతోమంది సినీ స్టార్స్ అలాగే రాజకీయ నాయకులు కూడా పాల్గొని సందడి చేశారు.

ప్రస్తుతం పీవీ సింధు రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ స్టార్స్ ఈ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యి నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi )తో పాటు నాగార్జున( Nagarjuna ) కూడా ఈ రిసెప్షన్ వేడుకలు సందడి చేశారు అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొని సందడి చేశారు.ఇక తమిళ చిత్ర పరిశ్రమ నుంచి అజిత్ శాలిని ఈ రిసెప్షన్ వేడుకల్లో సందడి చేశారు.

ఇకపోతే మెగా కోడలు ఉపాసన సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ తన సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఉపాసన మాత్రమే ఈ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.ఇక చిరంజీవి ఉపాసన ( Upasana ) విడివిడిగా ఈ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు.ఆదివారం సాయంత్రం పీవీ సింధు వివాహం రాజస్థాన్ లో జరిగింది.

ఇక ఈమె భర్త వ్యాపారవేత్త అని తెలుస్తుంది.ఇలా రాజస్థాన్ లో వివాహం అనంతరం హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షురూ.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
నువ్వు అసలు మనిషివేనా రష్మిక... బండ బూతులు తిడుతున్న నేటిజన్స్... ఏమైందంటే?

ఇక తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ వివాహ రిసెప్షన్ లో పాల్గొన్నారని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు