బాలీవుడ్ లో అవకాశం పట్టేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ దర్శకుడు తమన్ బాలీవుడ్ లో మరో అవకాశం సొంతం చేసుకున్నాడు.

తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సౌత్ స్టార్ మ్యూజిక్ దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్ కి పోటీ ఇస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తమన్ ఇప్పటికే బాలీవుడ్ లో టెంపర్ రీమేక్ గా వచ్చిన సింబ సినిమాకి మ్యూజిక్ అందించి సూపర్ హిట్ కొట్టాడు.

మరో వైపు గోల్ మాల్ 4 కూడా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది.ఇదిలా ఉంటే తాజాగా మరో అద్బుత అవకాశాన్ని తమన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.

స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుతం సూర్యవంశీ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు.ఇదిలా ఉంటే రోహిత్ శెట్టి, తమన్ కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా కావడం విశేషం.

Advertisement

సౌత్ మాస్ మసాలా బీట్స్ లో ఎక్స్ పర్ట్ అయిన తమన్ ని ఉపయోగించుకొని రోహిత్ శెట్టి అక్కడ మాస్ ట్యూన్స్ తో హిట్స్ కొట్టడానికి రెడీ అవుతున్నట్లు బీటౌన్ లో టాక్ వినిపిస్తుంది.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
Advertisement