ఈ స్టార్ హీరోల భార్యల గురించి మీకు తెలుసా.. ఆ వ్యాపారాల్లో అదుర్స్ అనిపించారుగా!

టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకులలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే టాలీవుడ్ స్టార్స్ భార్యలు సైతం తమకు ఆసక్తి ఉన్న రంగాలలో సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

అల్లు అర్జున్( Allu Arjun ) భార్య స్నేహారెడ్డికి( Sneha Reddy ) పిక్ ఏ బూ పేరుతో ఫోటోగ్రఫీ స్టార్టప్ ఉంది.గతంలో స్నేహ ఇంజనీరింగ్ కాలేజీల బాధ్యతలను నిర్వహించారు.

ఆ తర్వాత తన ఆసక్తులకు అనుగుణంగా వేర్వేరు థీమ్ లతో ఫోటో స్టూడియో ఏర్పాటు చేశారు.మెటర్నిటీ, పిల్లల ఫోటో షూట్ కోసం వేర్వేరు ప్యాకేజ్ లను ఆమె అందుబాటులోకి తీసుకొచ్చారు.

స్టూడియోలో స్నేహారెడ్డి డిజైనర్ దుస్తులతో పాటు ఫోటో షూట్ ప్రాపర్టీస్ ను సైతం అందిస్తున్నారు.అల్లరి నరేష్( Allari Naresh ) భార్య విరూప( Virupa ) సొంతంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను నడిపిస్తున్నారు.

Advertisement

అర్నిసియా స్టోర్ పేరుతో ఆమె ఈ బిజినెస్ చేస్తున్నారు.నాగశౌర్య( Naga Shourya ) భార్య అనూష శెట్టి( Anusha Shetty ) సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థను రన్ చేస్తున్నారు.

కర్ణాటక ప్రభుత్వం నుంచి అనూష శెట్టికి అవార్డులు సైతం వచ్చాయి.మనోజ్ ( Manoj ) భార్య భూమా మౌనిక( Bhuma Mounika ) నమస్తే వరల్డ్ పేరుతో బొమ్మల తయారీ సంస్థను మొదలుపెట్టి ఈ బిజినెస్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.రానా( Rana ) భార్య మిహీకా బజాజ్( Miheeka Bajaj ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు.

డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరుతో మిహీకా సొంతంగా ఒక సంస్థను నెలకొల్పారు.

మిహీకా బజాజ్ పేదలకు అండగా నిలబడటం కోసం ముదిత పేరుతో ఒక ఎన్జీవోను ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు సౌర విద్యుత్ ను ఏర్పాటు చేస్తున్నారు.ఈ సెలబ్రిటీలలో కొంతమంది సెలబ్రిటీలు భర్తలకు సమానంగా ఆదాయాన్ని సంపాదిస్తుండటం గమనార్హం.టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు వ్యాపారాలలో కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకుంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

తాజా వార్తలు