సెన్సిటివ్ టాపిక్స్ ని టచ్ చేస్తున్న స్మాల్ మూవీస్.. అదే వాటి సక్సెస్ మంత్ర..?

ఈ రోజుల్లో చిన్న సినిమాలు పెద్ద కాన్సెప్టులతో వస్తున్నాయి.సెన్సిటివ్ టాపిక్‌లను టచ్ చేస్తున్నాయి.

ఈ సున్నితమైన అంశాలను చాలా సున్నితంగా చూపిస్తే హిట్టు పక్క అని కొత్త దర్శకులు తెలుసుకున్నట్లున్నారు.అందుకే ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు.

రీసెంట్‌గా సక్సెస్ అయిన అన్ని సినిమాల్లో కూడా సేమ్ ఇదే ఫార్ములా కనిపిస్తోంది.అలాంటి సినిమాలు ఏవో తెలుసుకుందాం.

జనక అయితే గనక

సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న "జనక అయితే గనక(Janaka Aithe Ganaka )" సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాగా ఇది తెరకెక్కింది.ఈ మూవీలో పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం కోట్లతో కూడిన వ్యవహారంగా చూపించారు.

Advertisement

పిల్లల్ని కాకుండా నిరోధ్ వాడే సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ దీన్ని ఈ మూవీ వాళ్లు టచ్ చేయడమే చాలా పెద్ద విషయం.

జనక అంటే తండ్రి అయితే ఆర్థిక భారాలే అనే లాగా ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది.

ఆయ్

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ "ఆయ్"( Aay ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.గోదావరి నేపథ్యంలో, "మేమ్ ఫ్రెండ్స్ అండి" ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ చిత్రంలో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రలు పోషించారు.ఇందులో స్నేహం గురించి బాగా చూపించారు.

అలాగే కులాల టాపిక్ ని కూడా టచ్ చేసారు.సంబంధాలు లోతుగా పాతుకుపోయిన కుల అడ్డంకులను అధిగమించగలవని ఇందులో తెలియజేసారు.

దేవర మూవీ ఐదో రోజు కలెక్షన్లు లెక్కలు ఇదే.. ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారుగా!
ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?

వర్షాకాలంలో తీసిన ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంటుంది.

కమిటీ కుర్రోళ్లు

కామెడీ డ్రామా ఫిల్మ్ "కమిటీ కుర్రోళ్లు( Committee Kurrollu )"లో కూడా అత్యంత సున్నితమైన కులాల అంశాన్ని చాలా సున్నితంగా టచ్ చేసాడు దర్శకుడు.రూ.6 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.10 కోట్లు వసూలు చేసింది.ఈ మూవీ పల్లెటూరి వాతావరణం గురించి కూడా చాలా చక్కగా చూపించింది.

Advertisement

రొటీన్ సినిమాలకు భిన్నంగా, వెరైటీగా వస్తున్న స్మాల్ సినిమాలు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేయడమే ఒక అలవాటుగా పెట్టుకున్నాయి.ఇదే వాటికి సక్సెస్ మంత్ర అవుతోంది.

తాజా వార్తలు