వెండి తెరపై అస్సలు సెట్ కాని హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఇవే..

సినిమా హిట్ కావాలి అంటే.కథ, కథనంతో పాటు హీరో, హీరోయిన్ల సెలెక్షన్ కూడా బాగుండాలి.

అంతేకాదు.సినిమాలో పాటలు, ఫైట్లు, డైలాగులు, కామెడీ సీన్లు అన్నీ సమపాళ్లలో ఉంటేనే సినిమా జనాలకు నచ్చుతుంది.

ఏ ఒక్కటి తక్కువైనా జనాలు ఆ సినిమాను అంతగా రిసీవ్ చేసుకోలేరు.అలాగే పలువురు తెలుగు హీరోలు నటించిన సినిమాల్లో హీరోయిన్ల ఎంపికలో ఘోరంగా తప్పటడుగులు వేశారు దర్శకనిర్మాతలు.

ఫలితంగా జనాలకు విసుగు పుట్టించారు.ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Tollywood On Screen Pairs Which Are Not So Cool, Tollywood Pairs, Tollywood Flop

గతంతోల వెంకటేష్ – జెనీలియా జంటగా సుభాష్ చంద్రబోస్ సినిమాలో నటించారు.వీరిద్దరికి అస్సలు సెట్ కాలేదు అనే మాటలు వినిపించాయి.

అటు స్టాలిన్ సినిమాలో చిరంజీవి, త్రిష జంటపై ఓ రేంజిలో ట్రోలింగ్స్ వచ్చాయి.ఇక అల్లరి పిడుగు సినిమాలో బాలయ్య, కత్రినా కైఫ్ జంట అస్సలు కుదరలేదు.

అటు మహేష్ బాబు సినిమాల్లో హీరోయిన్స్ ఎంపిక చాలా కష్టంగా ఉంటుంది.ఖలేజా సినిమాలో మహేష్, అనుష్క జోడీ అస్సలు కుదరలేదు.

ఈ సినిమాలో అనుష్క తనకు అక్కలా కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపించాయి.ఇక నిజం సినిమాలోనూ తనకు రక్షితకు అస్సులు సూట్ కాలేదనే టాక్ వచ్చింది.

Tollywood On Screen Pairs Which Are Not So Cool, Tollywood Pairs, Tollywood Flop
టాలీవుడ్ లో హీరోలు వకీల్ సాబ్ లుగా నటించిన సినిమాలేంటో తెలుసా..?

అటు రజీకాంత్ నటించిన లింగా సినిమా విషయంలోనూ ఇలాంటి కామెంట్స్ వచ్చాయి.రజనీ వయసుతో పోల్చితే.ఈ సినిమాలో నటించిన అనుష్క, సోనాక్షి సిన్హాకు ఏమాత్రం పొంతన కుదరలేదు.

Advertisement

తుఫాన్ సినిమాలో రామ్ చరణ్, ప్రియాంక చోప్రా కలిసి నటించారు.వీరి జోడీ అస్సలు సెట్ కాలేదు.

అజ్ఞాతవాసి సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ నటించారు.పవన్ కు వీరికి సూట్ కాలేదని ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు.అటు అల్లు అర్జున్ హీరోగా చేసిన సినిమా వరుడు.

ఇందులో హీరోయిన్ గా భానుశ్రీ మెహ్రాను ఎంపిక చేశారు.కానీ వీరి కాంబోపైనా విమర్శలు వచ్చాయి.

అటు గణేష్ సినిమాలో రామ్, కాజల్ జంట కూడా అస్సలు కుదరలేదనే టాక్ వినిపించింది.

తాజా వార్తలు