Papam Pasivadu : హీరో హీరోయిన్లు లేకుండా ఎడారిలో సినిమా.. కట్ చేస్తే బంపర్ హిట్..

హీరో హీరోయిన్లు, డ్యూయెట్ సాంగ్స్‌, ఫైట్లు లేకుండా సినిమా తీసి సూపర్ హిట్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.

కథ, కథనం బాగుంటే మాత్రమే హీరో హీరోయిన్లు లేని సినిమాలు హిట్ అవుతాయి.

ఇప్పుడంటే కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు రావడం కామన్ అయ్యింది కానీ 50 ఏళ్ల క్రితం దర్శక నిర్మాతలు రెగ్యులర్ ఫార్మాట్ ని ఫాలో అయ్యేవారు.అలాంటి టైమ్‌లో ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని "పాపం పసివాడు( Papam Pasivadu )" సినిమా తీయాలని నిర్ణయించాడు.1969లో సౌత్‌ ఆఫ్రికన్‌ మూవీ ‘లాస్ట్‌ ఇన్‌ ది డిజర్ట్‌( Lost in the Desert )’ రిలీజ్ కాగా దానిని అట్లూరి పూర్ణచందర్రావు చూశారు.అది ఇండియాలో కూడా రిలీజ్ అయింది.ఆ మూవీని తెలుగులో ఎలాగైనా తీయాలని పట్టుబట్టారు.

తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా కథ సిద్ధం చేయాలని గొల్లపూడి మారుతీ రావు( Gollapudi Maruti Rao )ని ఆశ్రయించారు.ఆయన ఈ సినిమా చూసి తెలుగుకి తగినట్లు అద్భుతమైన కథను రాశారు.

ఇందులో ఎస్.వి.రంగారావు( SV Ranga Rao ), దేవిక, మాస్టర్ రాము ప్రధాన పాత్రలు పోషించారు.చెళ్ళపిళ్ళ సత్యం దీనికి సంగీతం అందించాడు.ఈ సినిమాలో ఫ్లైట్ కూలిపోయాక ఒక పిల్లోడు ఎడారిలో ఒంటరిగానే విపత్కర పరిస్తితులలో చిక్కుకుపోతాడు.1972 సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.నిర్మాత అట్లూరి పూర్ణచందర్రావు దీనికంటే ముందు "మోసగాళ్లకు మోసగాడు( Mosagallaku Mosagadu )" సినిమా తీశాడు.

Advertisement

అది కూడా ఎడారి నేపథ్యంలోనే తీయడం విశేషం.పాపం పసివాడు సినిమా షూటింగ్ రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో పూర్తి చేశారు.

ఇక అడవికి సంబంధించిన సన్నివేశాలను ముదుమలై ఫారెస్ట్‌లో కంప్లీట్ చేశారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో యుద్ధ భయం కూడా నెలకొన్నది.

దానివల్ల ఎడారి ప్రాంతంలో షూటింగ్‌కి పర్మిషన్ ఇవ్వడానికి ముందు రక్షణశాఖ చాలా యోచించింది.అలాంటి సమయంలో మూవీ యూనిట్ జైసల్మేర్‌ ఎమ్మెల్యేతో మాట్లాడి పర్మిషన్స్ తీసుకున్నారు.

అయితే డిఫెన్స్ అధికారులు 12 మంది భద్రతాధికారులను పంపించారు.ఎందుకంటే ఏదైనా జరిగితే బాధ్యత తమదే అవుతుంది కాబట్టి జాగ్రత్త తీసుకున్నారు.27 రోజుల్లో ఎడారిలో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశారు.మూవీ టీమ్ మెంబర్స్ 35 మంది ఉన్నారు కానీ ఈ ఎడారిలో నటించిన నటుడు ఒక్కడే, అతడు పేరు మాస్టర్‌ రాము.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కి తోడుగా టామీ అనే కుక్కపిల్ల కూడా ఎడారిలో చాలా కష్టపడింది.ఆ ఎడారిలో ఎండ వేడిమికి తట్టుకోలేక 11 గంటలలోపు కొంచెం షూటింగ్ కంప్లీట్ చేసి, మళ్లీ 4:00 అప్పుడు షూటింగ్ కూడా ప్రారంభించే వారు.మిగతా సమయంలో గుడారాల్లోకి వెళ్లి పోయేవారు.

Advertisement

అలా ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమా మంచి సక్సెస్ అయి అందరికీ సంతోషాన్ని కలిగించింది.ఈ సినిమా ప్రచారం కోసం హెలికాప్టర్ల నుంచి పాంప్లెట్లను పంచిపెట్టారు.

దీనిని తమిళంలో కూడా రిలీజ్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

తాజా వార్తలు