10 ఫ్లాప్స్ ఎదురైనా ఈ స్టార్ హీరోల క్రేజ్ ఏమాత్రం తగ్గదు..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోకి వరుసగా ఫ్లాప్స్‌ ఎదురైతే అతడి కెరీర్ క్లోజ్ అవుతుంది.

కానీ కొంతమంది హీరోలు మాత్రం ఎన్ని ఫ్లాప్స్ అందుకున్నా ఫెడవుట్ అవ్వరు.

ఎందుకంటే వారికి ఆ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది.అలాంటి హీరోలు తెలుగులో ముగ్గురు ఉన్నారు.

వారెవరో తెలుసుకుందాం.

• విజయ్ దేవరకొండ

నువ్విలా, ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు అర్జున్ రెడ్డి (Arjun Reddy)లాంటి 4 సినిమాలతోనే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ.ఆ తర్వాత అతనికి వరుసగా చాలా ఫ్లాప్స్ ఎదురు అయ్యాయి.ముఖ్యంగా లైగర్(Liger) సినిమా తర్వాత అతడి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.

Advertisement

కానీ అభిమానుల్లో ఈ రౌడీ బాయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.ప్లాపుల తర్వాత "ఖుషి" (Khushi)సినిమాతో విజయ్ ఖాతాలో ఒక మంచి హిట్ పడింది.రూ.55 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.77 కోట్లు సాధించింది.దాంతో మళ్లీ ఈ హీరో నిలదొక్కుకోగలిగాడు.

ఇప్పుడు అతను 12వ సినిమా చేస్తున్నాడు.ఇది హిట్ అయితే అతనికి కెరీర్ లో తిరుగు ఉండదు.నిజానికి ఫ్లాపులతో సంబంధం లేకుండా విజయ్ ని అభిమానించే హీరోలు ఉన్నారు.10 ఫ్లాప్స్ వచ్చినా అతనికి సినిమా అవకాశాలు తగ్గే అవకాశం ఉండదు.

• పవన్ కళ్యాణ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని వీరాభిమానులు పవన్ కళ్యాణ్‌కి(Pawan Kalyan) ఉన్నారు.ఈ హీరో ఎన్ని ఫ్లాప్ సినిమాలు తీసినా సరే అతడి క్రేజ్ కొంచెం కూడా తగ్గదు.కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, పంజా, అజ్ఞాతవాసి ఈ సినిమాలతో పవన్ కళ్యాణ్ భారీ డిజాస్టర్లను అందుకున్నాడు.

ఈ హీరోకి వరుసగా 10 ఫ్లాప్స్ వచ్చినా సరే అభిమానులు తగ్గరు సరి కదా పెరుగుతారు అని చెప్పుకోవచ్చు.

• ప్రభాస్

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బాహుబలి తర్వాత తీసిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. సలార్, కల్కి (Salar, Kalki) సినిమాలు మంచి కథ, స్టార్ క్యాస్ట్ కారణంగా హిట్స్ అయ్యాయని అంటారు.ఏది ఏమైనా ప్రభాస్ కు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.

Advertisement

అతను వద్దన్నా సరే దర్శకులు అతనితో మూవీలు చేయడానికి క్యూ కడుతున్నారు.అభిమానులు ఆయన నుంచి వచ్చే ప్రతీ సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు.

తాజా వార్తలు