ఒక చిన్న తప్పు తో కెరియర్ పోగొట్టుకుంటున్న స్టార్ హీరోయిన్స్ వీరే !

సినిమాల్లోకి ఒక్కసారి ఎంట్రీ ఇచ్చాక అన్ని విషయాల్లో ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.మరి ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి.

ఏమాత్రం చిన్న పొరపాటు జరిగిన మొదటికే మోసం వచ్చి కెరీర్ పోగొట్టుకోవాల్సి వస్తుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్స్ పరిస్తితి కూడా అలాగే ఉంది.

తెలిసి తెలియక చేసిన తప్పుల వలన తెలుగు సినిమా పరిశ్రమ తో పాటు పూర్తి కెరీర్ కూడా పోగొట్టుకునేలా ఉన్నారు.మరి ఆ హీరోయిన్స్ ఎవరు, ఎలాంటి తప్పులు చేసి కెరీర్ పోగొట్టుకుంటున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

పూజ హెగ్డే టాలీవుడ్ లో దువ్వాడ జగన్నాధం సినిమా ఫ్లాప్ అయిన ఆ తర్వాత కొన్ని హిట్ సినిమాల పుణ్యమా అని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పూజ హెగ్డే.ఈ అమ్మడు అరవింద సమేత, అల వైకుంఠపురం లో సినిమా లు హిట్ అవ్వడంతో ఆమె పారితోషకం ఐదు కోట్లకు తగ్గకుండా అడిగేది.

Advertisement

అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఫ్లాప్ అవుతున్నాయి అయినా కూడా ఆమె రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి తగ్గింపు చేయకపోవడంతో పలువు స్టార్ డైరెక్టర్లు తమ సినిమాలో పూజలు పెట్టుకోవాలంటే భయపడుతున్నారు.

సమంత సమంత కెరియర్ పరంగా పిక్ లో ఉన్న సమయంలో నాగచైతన్య తో విడాకులు తీసుకోవడంతో ఒక వర్గం ప్రేక్షకులకు శత్రువుగా మారింది.ఆ తర్వాత ఆమె తీసుకున్న కంటెంట్ సినిమాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటుండడంతో ఈ మధ్యకాలంలో ఆమె కెరియర్ గ్రాఫ్ కాస్త పడిపోతుందనే చెప్పాలి.పైగా ఒక బిగ్గెస్ట్ హిట్ సినిమాలో సమంత నటించి చాలా రోజులు అవుతుంది ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో సమంత కెరియర్ ముగిసిపోవడం ఖాయం.

రష్మిక మందన పుష్ప సినిమాతో తెలుగు నుంచి హిందీ సినిమా పరిశ్రమకు ఎగబాకింది రష్మిక కానీ ఒక్క కాంతారా విషయంలో దర్శకుడు రిషబ్శెట్టితో గొడవ పెట్టుకుని అనేక సినిమా పరిశ్రమలకు ప్రస్తుతం కొరకరాని కొయ్యలా మారింది.ఇక ఆమె పేరు చెప్తే వివాదాలు తప్ప మరేమీ గుర్తుకురాని పరిస్థితి కనపడుతుంది.అందుకే పోయి రష్మిక తో సినిమాలు ఎందుకు అని అనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు