సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం రావడం లేదా సక్సెస్ రావడం అంత ఈజీ కాదు.
ఇప్పుడున్న పరిస్థితులలో ఎంత మంచి అవకాశానికైనా ఆవగింజంత అదృష్టం కలిసి వస్తేనే కొంతమంది కెరియర్ నిలబడుతుంది.
సక్సెస్ వచ్చాక దానిని నిలబెట్టుకోవడానికి కెరియర్ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.అలా వచ్చిన సక్సెస్ ని ఎంతో కృషి చేస్తే కానీ నిలబడదు.
ప్రస్తుతం ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని టాలీవుడ్ లో ఒక ఇద్దరు హీరోయిన్స్ గురించి జోరుగా చర్చ సాగుతుంది.ఆ ఇద్దరు మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్, ( Anupama Parameswaran ) పూజా హెగ్డే.
( Pooja Hegde ) మరి ఇద్దరి గురించి ఇంత చర్చ జరగడానికి గల కారణం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
టిల్లు గాడి తో జోడి కట్టిన తర్వాత హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అందాల ప్రదర్శనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫిదా అయిపోయింది.ఆ సినిమా విజయాన్ని ప్రస్తుతం అనుపమ బాగా ఎంజాయ్ చేస్తుంది.కెరియర్ లో ఇలాంటి ఒక సినిమా పడితే చాలు వారికి ఇక సక్సెస్ నల్లేరు మీద నడకే అని అందరూ అనుకుంటున్నారు.
ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) పక్కన నటించడానికి అందుకే ఉబలాటపడుతున్నారు.మొత్తానికి మల్లు గర్ల్ అనుపమ పరమేశ్వరన్ కి ఆ అదృష్టం దక్కి విజయాన్ని అందుకుంది.
డీజే టిల్లు( DJ Tillu ) సినిమా సక్సెస్ తరువాత అనుపమ చాలా ఆచిదూచి తన సినిమాలను ఎంచుకుంటుంది.తెలుగులో పరద అనే ఒక చిత్రంతో పాటు మలయాళంలో మరో చిత్రంలో నటిస్తుంది.
మరిన్ని సినిమాలు త్వరలోనే ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు.
దాదాపు ఇలాగే ఉంది పూజా హెగ్డే పరిస్థితి కూడా.ఆమెకు రాకరాక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం వచ్చింది గతంలో నాగచైతన్యతో ఒక లైలా కోసం అనే చిత్రంలో నటించిన అది కలెక్షన్స్ పరంగా పెద్దగా వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఆమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కరమైపోయాయి.ఇలాంటి ఒక తరుణంలో నాగచైతన్య కి ఓ సినిమాలో నటించడానికి పూజ హెగ్డే కి అవకాశం దొరికింది.
విరూపాక్ష దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఈ సినిమా తర్వాత ఆమె పరిస్థితి మారుతుందా లేదా అని వేచి చూస్తే తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy