టాలీవుడ్ హీరోలు ఆ విషయంలో చాలా కష్టపడుతున్నారట

ఒకప్పుడు హీరోలు ఏడాదికి అయిదు నుండి పది పదిహేను సినిమాలు కూడా చేసేవారు.యాక్షన్‌ సన్నివేశాల కోసం డూప్‌ లను వినియోగించేవారు.

అంతే కాకుండా ఫిజిక్ విషయంలో మేకోవర్ విషయంలో అన్ని సినిమాలకు ఒకేలా ఉండేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు.

ఒక సినిమా లోని పాత్ర కోసం హీరోలు ( Heroes ) ఎంతగా వర్కౌట్‌ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడ్డం నుండి మొదలుకుని సిక్స్ ప్యాక్ బాడీ వరకు అన్ని విధాలుగా కూడా కష్టపడుతూ ఉంటారు.

తాజాగా తెలుగు హీరోల గురించి కొందరు విమర్శలు చేస్తున్నారు.తెలుగు హీరోల్లో( Tollywood Heroes ) కొందరు కష్టపడరు.

Advertisement

వారు బాగా సుఖం గా ఉండాలని కోరుకుంటారు.ప్రతి దాన్ని కూడా ఏసీ ఇండోర్‌ స్టూడియో లో సెట్‌ ను వేయించి షూటింగ్‌ చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు.తాజాగా ఆ విషయమై టాలీవుడ్‌ హీరోలు పెద్దగా స్పందించలేదు.

కానీ వారి అభిమానులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రస్తుతం స్టార్‌ హీరోగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతారు.ఒక్కో సన్నివేశానికి రోజంతా కూడా టేక్ ల మీద టేక్ లు తీసుకున్న సందర్భాలు ఉంటాయి.

ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్‌ గా ఉండాలని అనుకునే వారు ఉంటారు.అలాంటి హీరోలు ఫిజిక్ విషయంలో ఎంతగా కష్టపడుతారో అర్థం చేసుకోవచ్చు.అలాంటి టాలీవుడ్‌ హీరోల గురించి వస్తున్న వార్తలు నిజం కాదు.

సిక్స్ ప్యాక్ మరియు బరువు పెరగడం లేదా తగ్గడం వంటివి చేస్తూ ఉంటారు.వాటికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అలాంటిది తెలుగు హీరోలు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటూ కొందరు వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరి కాదు అంటూ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టాలీవుడ్ హీరోల యొక్క కష్టం గురించి తప్పుడు రాతలు రాసిన వారు ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు