Gopichand Flop Movies : అప్పుడు వరం ఇప్పుడు శాపం.. గోపీచంద్ సినిమాలు ఫ్లాప్ కావడానికి ఆ తప్పులే కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోపీచంద్( Gopichand ) సక్సెస్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.

కెరీర్ తొలినాళ్లలో విలన్ రోల్స్ లో నటించిన గోపీచంద్ తర్వాత రోజుల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను అందుకున్నారు.

ఒకప్పుడు మాస్ సినిమాలలో నటించిన గోపీచంద్ఆ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోగా ఇప్పుడు మాస్ సినిమాలే గోపీచంద్ పాలిట శాపమయ్యాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గోపీచంద్ ఈ మధ్య కాలంలో నటించిన రామబాణం, భీమా సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోలేదు.

రొటీన్ కథలతో తెరకెక్కడమే ఈ సినిమాలకు మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎప్పుడో తెరకెక్కిన రొటీన్ కథలకు స్వల్పంగా మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు వస్తే లాభం ఉండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

గోపీచంద్ మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలను ఎంచుకుంటే మాత్రమే కెరీర్ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది.కథల ఎంపికలో పొరపాట్లు రిపీట్ అయితే మాత్రం గోపీచంద్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.గోపీచంద్ సినిమాలకు సాధారణంగా ఒకప్పుడు 20 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చేవి.

Advertisement

ఇప్పుడు గోపీచంద్ సినిమాలకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో కూడా బిజినెస్ జరగడం లేదు.గోపీచంద్ తర్వాత సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైతే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.గోపీచంద్ తర్వాత మూవీ శ్రీనువైట్ల ( Srinu Vaitla )డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తైంది.

గోపీచంద్ ఎందుకు ఇలాంటి కథలను ఎంచుకుంటున్నారో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు.గోపీచంద్ కథల ఎంపికలో, సినిమాల ఎంపికలో మారాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

గోపీచంద్ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు