టాలీవుడ్ ఇండస్ట్రీలో పెరిగిపోతున్న ఆ వివాదాలు..??

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో సినిమా ప్రెస్‌మీట్లు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.

సినిమా కథ, పాటల గురించే కాకుండా కాపీ సీన్లు, అన్‌సెన్సార్డ్‌, డర్టీ డైలాగుల గురించి కూడా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

అయితే మొన్నటిదాకా ఈ క్వశ్చన్లు సినిమా అంశాలకు మాత్రమే పరిమితం అయ్యాయి కానీ ఇప్పుడు దిక్కుమాలిన ప్రశ్నలు అడుగుతున్నారు.ప్రశ్నలే చెత్తగా ఉంటే ఆన్సర్లు మరింత చెత్తగా ఉంటున్నాయి.

కొంతమంది డైరెక్టర్లు సినిమా జర్నలిస్టులను కావాలనే గోక్కుంటున్నారు.అందువల్ల ఈ ప్రెస్‌మీట్లు అనేవి వరస్ట్‌గా మారుతున్నాయి.

ఉదాహరణకు మిస్టర్ బచ్చన్ మూవీ( Mr.Bachchan movie ) టీమ్ మీడియా ఇంట్రాక్షన్ సమయంలో హరీష్ శంకర్‌ సినిమా ( Harish Shankar movie )జర్నలిస్టులను ఓ పిచ్చి ప్రశ్న వేశారు."సినీ జర్నలిస్టులు యాంకర్ సుమతో వేదిక మీద క్షమాపణలు చెప్పించారు కదా, మరి జర్నలిస్ట్ కొండేటి సురేష్‌తో అదే మాట ఎందుకు చెప్పించలేకపోయారు?" అని హరీష్ ఒక ప్రశ్న వేశాడు.నిజానికి ఈ ప్రశ్న అడగడం అనవసరం.

Advertisement

సినిమా జర్నలిస్టులను గెలికితే చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి.

కానీ హరీష్ శంకర్ వాళ్లపై విరుచుకుపడుతున్నాడు.మరోవైపు హీరోయిన్ నేహా శెట్టి( Neha Shetty ) మీద సురేష్ కొండేటి ఓ పిచ్చి కామెంట్ చేశాడు.దాంతో ఆమె చాలా ఫైర్ అయ్యింది.

చివరికి సురేష్ కొండేటి ( Suresh Kondeti )తప్పయింది అంటూ లెంపలేసుకున్నాడు.ఇవన్నీ చాలా చిన్న వివాదాలు.

ఇవి జరగడం కామన్.కానీ ఆ పాతవన్నీ తవ్వితే ఈ చిన్న కాంట్రవర్సీలు కాస్త పెద్దవిగా మారతాయి.

యూకే ప్రతిపక్షనేత బరిలో భారత సంతతి మహిళా ఎంపీ
కాఫీ ఎక్కువగా తాగితే లావు అవుతారా?

హరీష్ శంకర్ ఇలాంటి పెద్ద గొడవలు చేయాలని ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదు.

Advertisement

నిజానికి స్నాక్స్‌ను భోజనంలా తినేయకండి అని సుమ జోక్ వేయడంలో తప్పులేదు.ఆమెకు అందరి సినీ జర్నలిస్టుతో మంచి చనువు ఉంది, ఎవరో మనసును నొప్పించాలనే ఉద్దేశంతో ఆమె ఆ కామెంట్ చేసి ఉండదు.నిజానికి ఎక్కడ ఏం మాట్లాడాలో ఆమెకు బాగా తెలుసు.

తను మాట్లాడే మాటలు కాంట్రవర్సీకి ఆమడ దూరం ఉంటాయి.కానీ ఎవరో ఓ జర్నలిస్టు అనవసరంగా హార్ట్ అయిపోయి ఆమెపై అరిచేసాడు.

దాంతో సుమ తనంతట తానే సినీ జర్నలిస్టులు అందరికీ సారీ చెప్పింది.ఆమెతో ఏ జర్నలిస్టు బలవంతంగా క్షమాపణలు చెప్పించలేదు.

కొద్ది రోజుల క్రితం నటి రోహిణి ఎవరో సీనియర్ జర్నలిస్టు ఓవరాక్షన్‌ చేస్తే కడిగిపారేసింది.జర్నలిజం పోకడనే అలా తయారవుతున్నాయి.

తాజా వార్తలు