టాలీవుడ్‌లో లాక్‌డౌన్‌ అయినా హడావుడి కనిపిస్తూనే ఉంది

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు.దాంతో షూటింగ్స్‌ పూర్తిగా ఆగిపోయాయి.

ఇదే సమయంలో థియేటర్లు మూసేయడంతో పాటు సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి అనుకుంటున్నారు.కాని షూటింగ్‌ ఆగిపోయినా హడావుడి మాత్రం కనిపిస్తూనే ఉంది.

కొందరు సినిమాల ప్రమోషన్స్‌ కూడా చేసుకుంటున్నారు.ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడంతో పాటు పలు సినిమాలకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతూనే ఉంది.

Corona Effect Not Show In Tollywood Film Industrie , Tollywood, Charan, Rrr, Ntr

తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి రామరాజు వీడియో వచ్చింది.ఆ వీడియో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.ఇదే సమయంలో నితిన్‌ హీరోగా నటించిన రంగ్‌దే సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారు.

Advertisement
Corona Effect Not Show In Tollywood Film Industrie , Tollywood, Charan, RRR, NTR

ఇలా పలు సినిమాలకు సంబంధించిన ఏదో ఒక పని జరుగుతూనే ఉంది.ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ తన వకీల్‌ సాబ్‌ చిత్రంకు సంబంధించిన డబ్బింగ్‌ను ఇంట్లోంచే పూర్తి చేసినట్లుగా ప్రకటించాడు.

సినిమా పరిశ్రమలో సినిమాలు ఏమీ లేకున్నా కూడా సెబ్రెటీు ఆన్‌ లైన్‌ ద్వారా ఇంటర్వ్యూు ఇస్తూ లేదంటే మరో రకంగానో మీడియాకు దగ్గరగానే ఉంటున్నారు.ఇలా పలు రకాలుగా లాక్‌డౌన్‌లోనూ టాలీవుడ్‌లో సందడి కనిపిస్తూనే ఉంది.

లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే వరుసగా సినిమాలు విడుదల అయ్యేందుకు బాక్సాఫీస్‌ ముందు క్యూ కట్టి ఉన్నాయి.

స‌మ్మ‌ర్ లో బాడీ హీట్‌ను మాయం చేస్తే సూప‌ర్ డ్రింక్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు