సినిమాల్లో కనిపించని పాత్రలు ..అయిన సినిమా మొత్తం వాటి చుట్టే. !

సినిమా మేకింగ్ అనేది ఓ ఆర్ట్.అందుకే దర్శకులు సినిమాకు హార్ట్ లాంటి వారు.

సినిమాలో ప్రతి క్యారెక్టర్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతారు.రాసిన స్టోరీకి తగ్గట్లు తెరపై పాత్రలకు ప్రాణం పోయిస్తారు.

అయితే కొన్ని సినిమాల్లో రహస్య పాత్రలను స్రుష్టించించి వారెవ్వా అనిపించారు.సినిమా అంతా ఆ పాత్రల చుట్టే తిరిగినా.

సినిమాల్లో ఆ క్యారెక్టర్లు కనిపించకపోవడం నిజంగా వండర్.మనకు నిజంగా ఆ పాత్రలు ఉన్నట్లే అనిపించినా.

Advertisement
Tollywood Characters Who Are Not Visible In Movies, Arjunreddy, Jaanu, Mayabazaa

కనిపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.నిజంగా వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఆ క్యారెక్టర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మాయాబజార్

Tollywood Characters Who Are Not Visible In Movies, Arjunreddy, Jaanu, Mayabazaa

తెలుగు సినిమా సత్తా చాటిన చిత్రం మాయా బజార్.తెలుగు ప్రజల మనసుల్లో చిరకాలం నిలిచి ఉండిపోయే సినిమా ఇది.ఇందులో కూడా వినిపించి కనిపించని పాత్రలు ఉన్నాయి.ఈ మూవీలో ఘటోత్కచుడు, శ్రీ కృష్ణుడు, శశిరేఖ, అభిమన్యుడు.

పాత్రలు చేసిన అత్యద్భుత నటులు ఆ క్యారెక్టర్లకు ప్రాణం పోశారు.ఈ సినిమా కథలో ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి.

వాళ్లే పాండవులు.సినిమా కథ మొత్తం పాండవుల చుట్టే తిరుగుతుంది.చాలా సన్నివేశాల్లో వాళ్ల ప్రస్తావన వస్తుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

కానీ సినిమాలో ఎక్కడా ఆ పాత్రలు కనిపించకపోవడం విశేషం.

బాహుబలి

Tollywood Characters Who Are Not Visible In Movies, Arjunreddy, Jaanu, Mayabazaa
Advertisement

దిగ్గజ దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి.ఈ సినిమాలో భల్లాల దేవుడి పాత్ర ఎంతో కీలకం.ఆ పాత్రకి ఒక కొడుకు కూడా ఉంటాడు.

మరి అదేంటో అతని భార్య పాత్ర మాత్రం సినిమాలో పెట్టలేదు.సినిమాకి ఆ పాత్ర అంత అవసరం లేకపోయినా.

ఆ కొడుకుకు తల్లి ఎవరు అనేది తెలియాలి కదా.

బొమ్మరిల్లు

ఈ సినిమాలు చీటికి మాటికి సురేఖ వాణి ఎప్పుడూ తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది.ఆ ఇంట్లో ఏం జరిగినా, ఏం చేసినా ముందు తన భర్తకి అన్నీ ఎప్పటికప్పుడు చెప్పేస్తూ ఉంటుంది.ఆ భర్త క్యారెక్టర్ మాత్రం ఎవరో ఏంటో చూపించకపోవడం విశేషం.

మహానటి

సావిత్రి బయోపిక్ మహానటిలో కూడా ఓ అపరిచిత క్యారెక్టర్ ఉంది.ఈ సినిమాలో సమంత ఒకరి గురించి వెతుకుతూ ఉంటుంది.అదే శంకరయ్య ఎవరో తెలుసుకోవాలని.

అసలు శంకరయ్యకి, సావిత్రి గారికి సంబంధం ఏంటని.ఆ పాత్ర పేరు సినిమా మొత్తం ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటుంది.

అయినా.సినిమా చివరి వరకు ఆ పాత్ర ఎవరనేది చెప్పకపోవడం విశేషం.

సుందరకాండ

ఈ సినిమాలో ఒక గమ్మత్తైన పాత్ర ఉంటుంది.అదే వెంకీ వాళ్ల బామ్మ క్యారెక్టర్.అది కూడా గోడకు తగిలించిన ఓ ఫొటోలో.

సినిమా మొత్తం బామ్మ నిర్మలమ్మ గారు ఫొటోలో కనిపిస్తారు, కానీ ప్రత్యక్షంగా ఎక్కడా ఆ పాత్ర ఉండదు.

జాను

ఈ సినిమాలో జాను, రామచంద్ర స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్.అంతేకాదు, ఇద్దరి మధ్య తెలిసీతెలియని వయసులో ఒక చిన్న లవ్ ట్రాక్ నడుస్తుంది.కొన్ని కారణాల వల్ల ఇద్దరూ దూరం అవుతారు.

జాను వేరేవాళ్లని పెళ్లి చేసుకుంటుంది.రామచంద్ర మాత్రం చేసుకోడు.

ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ కలుసుకుంటారు.రామ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని జాను పదే పదే అడుగుతూ ఉంటుంది.

తను పెళ్లి చేసుకుంది.కానీ ఎవరిని చేసుకుందో మాత్రం చూపించరు.

అర్జున్ రెడ్డి

ఈ సినిమాలో ప్రీతికి పెళ్లి అయిపోయిందని.అర్జున్ తన జ్ఞాపకాలతోనే తెగ మందు తాగి.దేవదాసు అయిపోయాడు.

సినిమా చివర్లో ప్రీతి చెప్తుంది.కానీ ప్రీతి పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరో చూపించలేదు.

తాజా వార్తలు