Tolllywood Senior Heroines : దాదాపు 40 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్లు..

సాధారణంగా 35 ఏళ్లు దాటితే హీరోయిన్లు పాత సామాన్ల వలె మూలన పడిపోతారు.వారికి అవకాశాలు ఎక్కువగా రావు.

యంగ్ హీరోల పక్కన జత కట్టే అవకాశం ఉండదు కాబట్టి నెమ్మదిగా ఫేడ్ ఔట్ అవుతారు.పూజ, రకుల్, రెజీనా వంటి ముదురు ముద్దుగుమ్మలు ఇప్పటికే సినిమాలకు చాలా దూరం అయ్యారు.

కానీ వీరి కంటే వయసు ఎక్కువ ఉన్న ఎనిమిది మంది హీరోయిన్లు మాత్రం మూవీ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు.వారెవరో తెలుసుకుందాం పదండి.

నయనతార

మలయాళ మూవీ మనసునక్కరే (2003)తో నయనతార( Nayanthara ) వెండితెరకు పరిచయమైంది.అయ్య (2005)తో తమిళ చిత్రసీమలో, లక్ష్మి (2006)తో టాలీవుడ్ ఇండస్ట్రీలో సుపరిచితురాలు అయింది.

Advertisement

అంటే దాదాపు 20 ఏళ్లుగా ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని హీరోయిన్‌గా రాణిస్తోంది.ఇప్పటికే 75 సినిమాలు చేసిన ఈ అందాల తార ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

నయనతార వయసు 39 ఏళ్లు.

అనుష్క శెట్టి

చందమామ లాంటి రూపంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది అనుష్క శెట్టి. ఆమె 2005 తెలుగు చిత్రం "సూపర్‌"తో తొలిసారిగా నటించింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 42 ఏళ్లు.

అయినా సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ సక్సెస్‌లు అందుకుంటుంది.

త్రిష కృష్ణన్

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022

తమిళ రొమాంటిక్ డ్రామా జోడి (1999)లో చిన్న సపోర్టింగ్ రోల్‌తో అరంగేట్రం చేసింది త్రిష( Trisha Krishnan ) ఆపై మౌనం పెసియాదే (2002)లో ఫిమేల్ లీడ్ గా కనిపించింది.తమిళంలో సామి (2003), గిల్లి, ఆరు, సినిమాలతో హీరోయిన్ గా ఎదిగింది.అలానే వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Advertisement

ఇప్పుడు కూడా ఈ తార చాలా సినిమాల్లో చేస్తోంది.ఈ అమ్మడు వయసు 40 ఏళ్లు.

శ్రేయ శరణ్‌

శ్రేయ( Shriya Saran ) తెలుగు చిత్రం ఇష్టం (2001)తో సినీ రంగ ప్రవేశం చేసింది.సంతోషం (2002)తో ఫస్ట్ సక్సెస్ అందుకుంది.ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపిస్తుంటుంది.

హీరోయిన్‌గా కాకపోయినా కీలకమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది.శ్రేయ వయసు 41 ఏళ్లు.

మీరా జాస్మిన్

ఈ ముద్దుగుమ్మ వయసు కూడా 40 ఏళ్లు.అయినా సినిమాల్లో ఇప్పటికీ కనిపిస్తోంది.

వీరితోపాటు శ్రుతి హాసన్, సమంత రుత్‌ ప్రభు, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్లు 35 ఏళ్ల వయసు వచ్చినా హీరోయిన్ అవకాశాలు దక్కించుకుంటూ ఆశ్చర్య పరుస్తున్నారు.

తాజా వార్తలు