నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఏపీలో పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు.

తమ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ.

జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఒకపక్క వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర చేపడుతూ జనాలకు మరింత దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉండగా .మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు ఒకపక్క జగన్  పైన విమర్శలు చేస్తూ,  మరోవైపు టిడిపి( TDP ) కూటమిని గెలిపించాల్సిందిగా కోరుతూ మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

తెనాలికి చంద్రబాబు

 

Todays Election Campaign Chandrababu Ys Jagan Here , Ap Elections, Ysrcp, Ap Gov

ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) పర్యటించనున్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ లో సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు తెనాలి చేరుకుంటారు.సాయంత్రం 6 గంటలకు మార్కెట్ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో కొంతమంది వైసీపీ నాయకులు టిడిపిలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Todays Election Campaign Chandrababu Ys Jagan Here , Ap Elections, Ysrcp, Ap Gov

జగన్ బస్సు యాత్ర

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం తో పాటు,  మైదుకూరు,  పీలేరులలో ఎన్నికల ప్రచారంలో జగన్( YS Jagan Mohan Reddy ) పాల్గొన బోతున్నారు.టంగుటూరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన కొనసాగనుంది.

Advertisement
Todays Election Campaign Chandrababu Ys Jagan Here , Ap Elections, Ysrcp, AP Gov

కొండేపి నియోజకవర్గం టంగుటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న జగన్ అక్కడ ఏర్పాటుచేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.మధ్యాహ్నం 12:30 కి మైదుకూరు నాలుగు రోడ్ల జంక్షన్ లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.

మధ్యాహ్నం మూడు గంటలకు కనిగిరి లో ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొంటారని వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు