నేడే మోక్ష ఏకాదశి..సాయంత్రం ఈ చిన్న పని చేస్తే చాలు అదృష్టం మీ వెంటే?

మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది.

ఈ క్రమంలోనే మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిను మార్గశిర ఏకాదశి లేదా మోక్ష ఏకాదశి అని పిలుస్తారు.

మార్గశిర మాసం ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు.విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మార్గశిర మాసంలో ఏ చిన్న కార్యం చేసిన ఎంతో మంచి ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మోక్ష ఏకాదశి అంటారు.ఈ మోక్ష ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తూ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల మనకు ఎన్నో పాపాల నుంచి మోక్షం కలుగుతుందని చెప్పవచ్చు.

ఇక నేడు మోక్ష ఏకాదశి కావడంతో ఉదయమే నిద్రలేచి తలంటు స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసి అనంతరం విష్ణుమూర్తి చిత్రపటానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.అదేవిధంగా స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో నేడు స్వామివారికి పూజ చేయాలి.

Advertisement

అదే విధంగా సాయంత్రం మరలా స్వామివారిని పూజించి మనకు చేతనైన దానధర్మాలను చేయాలి.సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి మోక్షాద ఏకాదశి సందర్భంగా ‘భగవద్గీత’, ‘విష్ణు సహస్రనామం’, ‘ముకుందష్టకం’ చదవడం శుభంగా పరిగణిస్తారు.

మోక్ష ఏకాదశి రోజున  మొత్తం ఉపవాసం, ఉండి విష్ణు సహస్ర నామాలను చదువుతూ జాగరణ చేసిన  అనంతరం మరుసటి రోజు స్నానం చేసి పూజ చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ ఏకాదశి వ్రతం ముగుస్తుంది.ఇలా మోక్ష ఏకాదశి వ్రతం చేసిన వారికి ఏ విధమైనటువంటి పాపాలు లేకుండా పాపాల నుంచి మోక్షం కలుగుతుందని అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు