ఆ సమస్య తీర్చమంటే గర్భవతిని చేశాడు.. వైరల్ అవుతున్న లాస్య కామెంట్స్!

సినిమాల్లో హీరోహీరోయిన్లకు ఎన్ని సమస్యలు వచ్చినా మూవీ క్లైమాక్స్ కు వచ్చే సమయానికి ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

అయితే రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమను గెలిపించుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

బుల్లితెర యాంకర్ లాస్య మంజునాథ్ ను ప్రేమించి ఆ ప్రేమను గెలిపించుకోవడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు.రవి లాస్య కలిసి చేసిన షోలకు మంచి పేరు రాగా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ రవి గురించి లాస్య సంచలన ఆరోపణలు చేశారు.

అయితే ఆ తర్వాత రోజుల్లో రవి లాస్య మధ్య విభేదాలు తొలగిపోయాయి.అయితే తాజాగా లాస్య సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ అభిమానులకు షాకిచ్చేలా ఉండటంతో పాటు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సాఫ్ట్ గా ఉండే లాస్య ఒకింత బోల్డ్ పోస్ట్ చేసి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేశారు.కొన్ని నెలల క్రితం రెండోసారి గర్భం దాల్చానని ప్రకటించిన లాస్య తాను గర్భం దాల్చడం గురించి ఆసక్తికర పోస్ట్ చేశారు.

Advertisement

ఆ పోస్ట్ లో పీరియడ్స్ వల్ల ఇబ్బంది కలుగుతోందని నా భర్త మంజునాథ్ కు చెప్పానని నన్ను గర్భవతిని చేయడం ద్వారా మంజునాథ్ 9 నెలల పాటు పీరియడ్స్ సమస్యను దూరం చేశాడని లాస్య వెల్లడించారు.లాస్య వెల్లడించిన ఈ విషయాల గురించి నెటిజన్ల నుంచి వెరైటీ రియాక్షన్లు వస్తున్నాయి.

లాస్య ఈ విధంగా మాట్లాడటం తాము ఎప్పుడూ చూడలేదని కొంతమంది నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే లాస్య, మంజునాథ్ లకు కొడుకు ఉండగా ఈసారి కూతురు పుట్టాలని లాస్య కోరుకుంటున్నారు.భగవంతుడు లాస్య కోరికను తీర్చాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.బుల్లితెర క్యూట్ జోడీలలో లాస్య మంజునాథ్ జోడీ ఒకటని ఈ జోడీ కలకాలం సంతోషంగా ఉండాలని రాబోయే రోజుల్లో కూడా ఈ జంటకు ఎలాంటి కష్టం రాకూడదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు