చూడడానికి ఇది సైకిల్.. వేగంలో బైకుతో సమానంగా పరుగులు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంపై ఆసక్తి పెరుగుతోంది.దీంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు.

ముఖ్యంగా పెట్రోల్ రేట్లు కూడా బాగా పెరిగాయి.మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

దీంతో వాహనాలు బయటకు తీయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా భారత్‌లో మాత్రం పెట్రోల్ రేట్లు తగ్గడం లేదు.

నానాటికి పెరుగుతున్న పెట్రోల్ ధరలను తట్టుకోలేక చాలా మంది ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.పలు దేశీయ, విదేశీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి.

Advertisement

కొన్ని అందుబాటు ధరల్లో ఉంటే, కొన్ని ఖరీదుగా ఉంటున్నాయి.ఈ తరుణంలో ఓ వ్యక్తి తన కుమారుడి కోసం వినూత్న బైక్ రప్పించాడు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

పర్యావరణ హితంతో పాటు తన కుమారుడిపై ప్రేమతో ఓ తండ్రి విదేశాల నుంచి ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని రప్పించాడు.ఇది ఏపీలోని కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉంది.ఓ ఫర్నిచర్ షాపు యజమాని తన కుమారుడి కోసం దీనిని విదేశాలలో కొనుగోలు చేసి, ఇక్కడకు తీసుకొచ్చారు.

తన కుమారుడు చైతన్యకు దీనిని బహుమతిగా అందజేశాడు.దీనిని ఇటలీలో తయారు చేశారు.దీని ధర అక్షరాలా రూ.1.40 లక్షలు.వాహనాన్ని కొనుగోలు చేయడంతో పాటు, రిజిస్ట్రేషన్ ఖర్చులు, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి ఇంత ధర అయింది.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

ఇది చూడడానికి అచ్చం సైకిల్‌లా ఉంటుంది.అయితే బైక్‌తో సమానంగా పరుగులు తీస్తుంది.

Advertisement

దీంతో ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించి, నంబర్ ప్లేటు కూడా అమర్చారు.దీనిపై చైతన్య అనే యువకుడు ప్రయాణిస్తున్నాడు.

పిఠాపురంలో ప్రజలంతా దీనిని అత్యంత ఆసక్తితో చూస్తున్నారు.చూడడానికి సైకిల్‌లా ఉందని, అయితే బైక్‌తో పోటీ పడుతూ పరుగులు తీస్తోందని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.