జాతకంలో గురు బలం వృద్ధి చెందాలంటే.. గురువారం రోజున ఈ నివారణలు చేయండి..!

హిందూ ధర్మంలో గురువారం శ్రీమహా విష్ణువు,( Lord Vishnu, ) దేవ గురు బృహస్పతి( Brihaspati ) ఆరాధనకు చాలా పవిత్రమైనదని పండితులు చెబుతున్నారు.

గురువారం రోజున ఈ దేవతలకు చేసే పూజలు అత్యంత ఫలవంతం అని ప్రజలు నమ్ముతారు.

వ్యక్తి ఆనందాన్ని, అదృష్టాన్ని పెంచడంతో పాటు జీవితంలో అన్నీ కోరికలు నెరవేరుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.సనాతన ధర్మం ప్రకారం విష్ణువు,దేవ గురువు అనుగ్రహం పొందడానికి గురువారం పూజ, పారాయణం, విష్ణువు అనుగ్రహం కోసం మంత్రాలను పఠించడం, ఉపవాసం( Fasting )తో పాటు ఈ రోజు చేసే దానాలతో కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించడం అవసరమని చెబుతున్నారు.

గురువారం రోజు చేయాల్సిన పూజ నియమాలు చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇలా చేసిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమని, అదృష్టం వీరి సొంతమని చాలా మంది ప్రజలు నమ్ముతారు.అలాగే మీరు బృహస్పతి అనుగ్రహాన్ని పొందాలంటే ముందుగా గురువారం రోజు( Thursday ) సూర్యోదయానికి ముందు నిద్రలేచి, స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి.

ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వచ్చి ఏ పని చేపట్టిన విజయం అవుతాయని చాలామంది ప్రజలు నమ్ముతారు. శ్రీమహా విష్ణువు ఆరాధనకు గురువారం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

Advertisement

అటువంటి పరిస్థితుల్లో శ్రీహరి అనుగ్రహం పొందడానికి మీరు గురువారం రోజున శ్రీమహావిష్ణువుకు పసుపు, పుష్పాలు, గంధం, పసుపు రంగు పండ్లు, పసుపు వస్త్రాలు మొదలైన వాటిని సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపిస్తూ ఉండాలి.ఇంకా చెప్పాలంటే హిందూ ధర్మం ప్రకారం శ్రీ మహావిష్ణువు, దేవ గురు బృహస్పతి అరటి చెట్టు పై నివసిస్తారని చాలామంది ప్రజలు నమ్ముతారు.గురువారం రోజున అరటి చెట్టు( Banana tree )ను పూజించడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది.

అలాగే గురువారం రోజు ఉపవాసం కూడా ఉండాలి.ఈ రోజున సత్య నారాయణుని కథ చదవడంతో పాటు సత్యనారాయణ స్వామిని( Satyanarayana Swamini ) ఆరాధించడం వల్ల కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయి.

Advertisement

తాజా వార్తలు