బోధన ఏకాదశి రోజు విష్ణువు అనుగ్రహం పొందాలంటే.. పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే..!

అన్నీ మాసాల కంటే కార్తీక మాసన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు.కార్తీక మాసం( Karthika Masam )తో సమానమైన మాసం లేదని పండితులు చెబుతున్నారు.

మీ కోరికలన్నీ నెరవేరడానికి ముఖ్యమైన ఈ నియమాలను తప్పక పాటించాలి.ఈ సంవత్సరం నవంబర్ 23వ తేదీన దేవశయని రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ ధర్మంలో ఏకాదశి తిధికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

సంవత్సరం పొడవునా ఉండే 24 ఏకాదశులు శుభకరం అని భక్తులు భావిస్తారు.అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంది.

మంగళకరమైన కార్తీక మాసం శివకేశవులకు పవిత్రమైన మాసం అని చెబుతారు.అయితే ఈ కార్తిక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి( Bodhan Ekadashi ), దేవ ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు.

Advertisement

ఈ ఏకాదశి రోజు చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి ఉపవాస వ్రతం చేపట్టాలి.దేవుత్తని ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుకు తెల్లని పదార్థాలుగా నైవేద్యంగా సమర్పించాలి.

ఈ రోజున ఖీర్ లేదా ఏదైనా తెలుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి.విష్ణువుకు తెల్లని పదార్థాలు అంటే ఎంతో ఇష్టం.ఈ రోజున నిర్జల ఉపవాసం ఉంచడం వల్ల విష్ణువు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు.

ఈ ఏకాదశి రోజు అసలు చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏకాదశి రోజున అన్నం పొరపాటున కూడా తినకూడదు.ఏకాదశి వ్రతం పాటించే వ్యక్తి ముందు రోజు సాయంత్రం నుంచి అన్నం తీసుకోవడం మానేయాలి.ఉపవాస సమయంలో ఎవరి పైన ద్వేషం లేకుండా చూసుకోవాలి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
శరత్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం

ఈ రోజున వృద్ధులకు సహాయం చేయడం ద్వారా లక్ష్మీదేవి( Lakshmi Devi ) సంతోషిస్తుంది.ఈ ఏకాదశి రోజున తులసి మాతకు శాలిగ్రహంతో వివాహ కార్యక్రమం నిర్వహించాలి.

Advertisement

ఏకాదశి రోజున తులసిని పూజించడం మర్చిపోకూడదు.ఈ రోజున ఇంట్లో కానీ, బయట గాని ఎవరితోనూ గొడవ పడకూడదు.

ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు.అలాగే ఈ రోజున వెల్లుల్లి ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి.

తాజా వార్తలు